Manish Sisodia : సిసోడియాకు బెయిల్ దొరికేనా
కోర్టులో హాజరు పర్చనున్న సీబీఐ
Manish Sisodia CBI Bail : ఢిల్లీ మద్యం స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీ పొడిగిస్తారా లేదా అన్నది సోమవారం నాటితో తేలి పోనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ 34 మందిపై కేసు నమోదు చేసింది. మొత్తం సిసోడియాతో కలిపి 10 మందిని అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరు పర్చగా మనీష్ సిసోడియా కస్టడీలోకి తీసుకుంది సీబీఐ. 10 రోజుల పాటు అడిగింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
కానీ 5 రోజుల పాటే ఇచ్చింది కోర్టు. మనీష్ సిసోడియా కావాలని తమకు సహకరించడం లేదని సీబీఐ(Manish Sisodia CBI Bail) ఆరోపించింది. అందుకే కస్టడీ ఇవ్వాలని కోరింది. మద్యం పాలసీని మార్చడంతో పాటు రూ. 100 కోట్లను సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు చేరవేసేలా మనీష్ సిసోడియా కీలక పాత్ర పోషించారని ఆరోపించింది.
ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఇదే సమయంలో ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా కీలక పాత్ర ఉందని స్పష్టం చేసింది.
సీబీఐ కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ లో కీలక వివరాలు పేర్కొంది. ఈ తరుణంలో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ 9 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు సుదీర్ఘ లేఖ రాశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి.
ఇక మనీష్ సిసోడియా వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. తనను మానసికంగా చిత్ర హింసలకు గురి చేశారంటూ ఆప్ సంచలన ఆరోపణలు చేసింది.
Also Read : సిసోడియాను వేధిస్తున్న సీబీఐ – ఆప్