Manish Sisodia : మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు
భార్య అనారోగ్యంతో ఉందన్న లాయర్
Manish Sisodia Custody Extends : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీ పొడిగించింది సీబీఐ కోర్టు. శనివారం సీబీఐ ఆయనను కోర్టులో హాజరు పర్చింది. తనకు బెయిల్ ఇవ్వాలని, తన భార్య అనారోగ్యంతో ఉందని కోరారు సిసోడియా. అయితే ఇందుకు సీబీఐ ఒప్పుకోలేదు. ఆయన తమకు సహకరించడం లేదని, అన్నీ అబద్దాలే చెబుతున్నారంటూ ఆరోపించింది. ఇప్పటికే 5 రోజుల కస్టడీ ఇచ్చామని ఇంకెన్ని రోజులు ఇవ్వాలని కోర్టు ప్రశ్నించింది.
సహకరించక పోవడం వల్లనే తాము కస్టడీ కోరుతున్నామని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. అయితే మనీష్ సిసోడియాకు సంబంధించి సోమవారం వరకు కస్టడీ పొడిగించింది(Manish Sisodia Custody Extends) కోర్టు. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. అయితే బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని కోర్టు సీబీఐని కోరింది. బెయిల్ పిటిషన్ పై మార్చి 10న విచారణ జరగనుంది. సిసోడియా భార్య పరిస్థితి దయనీయంగా ఉందని, ఆమె ఇంకా షాక్ లోనే ఉందని మనీష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఆధారాలు లేకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది సీబీఐ. పక్కా సమాచారం, ఆధారాలతోనే తాము మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నామని , ఆయన ఏ ఒక్క దానికి సరైన జవాబు ఇవ్వడం లేదని కావాలని చేస్తున్నాడంటూ ఆరోపించింది.
ఇలా ఉంటే కేసు ముందుకు కదలదని పేర్కొంది. అయితే తాను మద్యం పాలసీ మారిస్తే సంతకం చేసిన మాజీ ఎల్జీ అనిల్ జునేజాను కూడా అరెస్ట్ చేయాలని అన్నారు మనీష్ సిసోడియా(Manish Sisodia).
Also Read : నటుడు షీజాన్ ఖాన్ కు బెయిల్