Manish Sisodia : అమిత్ షాను అరెస్ట్ చేయండి – సిసోడియా
ఆపరేషన్ ఎమ్మెల్యేల వ్యవహారంలో పాత్ర
Manish Sisodia : ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారంలో బీజేపీకి చెందిన వారు అడ్డంగా బుక్ అయ్యారని ఆరోపించారు.
ఈ మొత్తం ఘటన వెనుక అమిత్ షా హస్తం ఉందని వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని మనీస్ సిసోడియా డిమాండ్ చేశారు. బీజేపీ ఆపరేషన్ కమలం గత కొంత కాలంగా దేశంలో కొనసాగుతూ వస్తోందని చాలా ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓ బ్రోకర్ పట్టుబడితే అందులో దేశ హోం శాఖ మంత్రి ప్రమేయం ఉంటే అది చాలా ప్రమాదకరమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి అమిత్ షాను విచారించాలని కోరారు. బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు మనీష్ సిసోడియా(Manish Sisodia). శనివారం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. బీజేపీయేతర పాలిత రాష్‌ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసేందుకు ఆపరేషన్ కమలంలో పాలు పంచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆప్ నేతలతో పాటు పంజాబ్ , ఎనిమిది రాష్ట్రాల్లో ఇంతకు ముందు బీజేపీ వేట కొనసాగించిందని ధ్వజమెత్తారు మనీష్ సిసోడియా.
బీజేపీలోకి మారేందుకు కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను కలిగి ఉన్న ఆడియో క్లిప్ ను ప్రస్తావించారు మనీష్ సిసోడియా. ఒక వేళ హొం మంత్రి పేరు గనుక ఉంటే అది యావత్ దేశానికే ప్రమాదకరమని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
Also Read : మీ సీఎంను మీరే ఎన్నుకోండి – కేజ్రీవాల్