Arvind Kejriwal Sisodia : సిసోడియాను అరెస్ట్ చేసే ఛాన్స్ – సీఎం

ఇదే నిజ‌మంటున్న కేజ్రీవాల్

Arvind Kejriwal Sisodia Arrest : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వ‌ర‌లోనే త‌మ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశార‌ని ఆరోపించారు.

విశ్వ‌సనీయ స‌మాచారం మేర‌కు త‌న‌కు తెలిసింద‌న్నారు సీఎం. ఇప్ప‌టికే మ‌రో మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ విష‌యంలో కూడా ఇలాగే చెప్పారు అర‌వింద్ కేజ్రీవాల్. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లీక్క‌ర్ స్కాం కేసు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. సిసోడియాను అరెస్ట్ చేయ‌డం ఖాయ‌మ‌ని మా వ‌ర్గాలు చెబుతున్నాయంటూ బాంబు పేల్చారు ఢిల్లీ సీఎం(Arvind Kejriwal Sisodia Arrest).

ఇప్ప‌టికే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ దాడి చేసింది. సిసోడియా నివాసంలో జ‌ల్లెడ ప‌ట్టింది. మొత్తం 34 మందికి సంబంధం ఉంద‌ని తేల్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో సీబీఐ కోర్టుకు స‌మ‌ర్పించిన రెండో రిపోర్ట్ లో దిగ్భ్రాంతిని క‌లిగించేలా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌విత‌, ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా చేర్చింది. ఇదంతా అబ‌ద్ద‌మ‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు.

రాజ‌కీయంగా త‌న‌ను ఎదుర్కోలేక‌నే బీజేపీ ఇలాంటి చవ‌క‌బారు ట్రిక్స్ ప్లే చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద‌మ్ముంటే ధైర్యంగా ముందుకు రావాల‌ని స‌వాల్ విసిరారు. మొత్తంగా మ‌రో వికెట్ ప‌డ‌నుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు సీఎం. ఢిల్లీ లిక్క‌ర్ ఎక్సైజ్ పాల‌సీ కేసులో సీబీఐ విచార‌ణ‌కు పిలిచిన డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు జోష్యం చెప్పారు.

Also Read : ఎల్జీ ఆదేశాలు పాటించ‌కండి – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!