Manish Sisodia : నిజాయితీకి దక్కిన గౌరవం – సిసోడియా
ఆమోదించిన ఆప్ చీఫ్..సీఎం కేజ్రీవాల్
Manish Sisodia Resign : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా(Manish Sisodia Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పంపించారు.
ఆయనతో పాటు తీహార్ జైలులో ఉన్న సత్యందర్ జైన్ కూడా తన మంత్రి పదవికి గుడ్ బై చెప్పారు. మంగళవారం రాత్రి తమ పోస్టులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖలో కీలకమైన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు మనీష్ సిసోడియా.
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాను. గత ఎనిమిది సంవత్సరాలుగా నిజాయితీగా పని చేశానని అన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. విద్యా రంగంలో సంస్కరణలు తీసుకు వచ్చాను. ఆరోగ్య పరంగా కీలక నిర్ణయాలు తీసుకున్నా. తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు మేలు చేకూర్చేందుకు ప్రయత్నం చేశానని అన్నారు. ఇవాళ దేశంలోనే ఆదర్శ ప్రాయంగా మొహల్లా క్లినిక్ లు, బడులు ఉన్నాయని పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా నిజాయితీనే నమ్ముకున్నా. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్దం. బలహీనమైన కుట్ర జరిగిందన్నది వాస్తవమన్నారు. ఇవాళ నేను కాదు టార్గెట్ . కేంద్రానికి అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా మారారు. యావత్ దేశ ప్రజలంతా సీఎంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారంటూ స్పష్టం చేశారు. ఇక సిసోడియా(Manish Sisodia Resign), సత్యేంద్ర జైన్ రాజీనామా లేఖలను ఎల్జీ సక్సేనా ఆమోదం కోసం పంపించారు సీఎం కేజ్రీవాల్.
Also Read : సిసోడియాకు సుప్రీం బిగ్ షాక్