Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాకు కొంత ఉరటనిచ్చిన ధర్మాసనం
వారానికి రెండుసార్లు రిపోర్ట్ చేయాలనే బెయిలు షరతును తొలగిస్తు్న్నాం...
Manish Sisodia : లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ‘ఆప్’ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బెయిలు షరతులను అత్యున్నత న్యాయస్థానం బుధవారంనాడు సడలించింది. బెయిలు షరతుల ప్రకారం, వారంలో రెండు సార్లు విచారణ కార్యాలయంలో ఆయన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది.
Manish Sisodia Got Relief
”వారానికి రెండుసార్లు రిపోర్ట్ చేయాలనే బెయిలు షరతును తొలగిస్తు్న్నాం. అయితే అప్లికెంట్ (సిసోడియా) రెగ్యులర్‌గా విచారణకు హాజరు కావాలి” అని కోర్టు స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో సిసోడియా(Manish Sisodia)కు గత ఆగస్టు 9న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ జరపకుండా 17 నెలల పాటు నిర్బంధంలో ఉంచడాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు బెయిలు మంజూరు చేసింది. అయితే ప్రతి సోమ, గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విచారణ అధికారికి రిపోర్ట్ చేయాలని షరతు విధించింది.
సిసోడియా బెయిల్ అభ్యర్థనపై నవంబర్ 22న విచారణకు అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ, ఈడీలను స్పందించాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. 22వ తేదీ విచారణలో సిసోడియా తరఫు న్యాయవాది తమ వాదన వినిపిస్తూ, దర్యాప్తు అధికారుల ముందు సిసోడియా 60 సార్లు హాజరయినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ 2023 ఫిబ్రవరి 26న సిసోడియను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం మార్చి 9న మనీలాండరింగ్ కింద ఈడీ ఆయనను అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి 28న ఢిల్లీ క్యాబినెట్‌కు సిసోడియా రాజీనామా చేసారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టివేశారు.
Also Read : Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పై పోలీస్ కేసు నమోదు