బీజేపీ (BJP) పక్కలో బల్లెంలా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను చంపాలని చూస్తోందంటూ ఆప్ ఆరోపించింది. సెక్యూరిటీని దాటుకుని సీఎం ఇంటి పైకి దండులాగా కదిలి వచ్చారని ఆరోపించారు.
గేటు పైకి దూకారాని, సీసీ టీవీ కెమెరాలను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు. ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ పై కేజ్రీవాల్ (Kejriwal) సంచలన కామెంట్స్ చేశారు.
దీనిని నిరసిస్తూ కాశ్మీరీ పండిట్లను అవమానించారంటూ బీజేపీ (BJP) సారథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) నివాసం ముందు వాగ్వావాదానికి దిగారు. ఆపై దాడికి దిగారు.
ఈ సందర్భంగా ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ (Kejriwal) ను ఎన్నికల్లో ఓడించ లేక ఆయనను చంపాలని బీజేపీ (BJP) చూస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాజకీయాలు ఒక సాకుగా ఉపయోగించుకుని దాడి చేసేందుకు ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు సిసోడియా. బీజేపీ గూండాలు పోలీసుల సమక్షంలోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారని అన్నారు.
ఎన్నికల్లో ఓడించ లేక చంపాలని కుట్రలు పన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను సీఎం ఇంటికి చేరుకునేందుకు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ మనీష్ సిసోడియా ప్రశ్నించారు.
వీళ్లు దేశ భక్తులు కాదని సంఘ విద్రోహ శక్తులంటూ మండిపడ్డారు. సెక్యూరిటీని దాటుకుంటూ దాడి చేసేందుకే ప్రయత్నం చేశారంటూ సీరియస్ అయ్యారు. దీనిని తాము పూర్తిగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు సిసోడియా.