Manish Sisodia : కేంద్ర స‌ర్కార్ పై సిసోడియా క‌న్నెర్ర‌

రోహింగ్యాల‌కు నివాసం క‌ల్పించేందుకు కుట్ర‌

Manish Sisodia :  ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో రోహింగ్యాల‌కు శాశ్వ‌త నివాసం క‌ల్పించేందుకు కేంద్రం ర‌హ‌స్యంగా ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ఆరోపించారు.

రోహింగ్యాల‌ను ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరీ ప్లాట్ ల‌కు త‌ర‌లించే చ‌ర్య‌ను కేంద్రం త‌న సాధ‌న‌గా పిలుస్తోంద‌న్నారు. ఆ త‌ర్వాత ఢిల్లీ ప్ర‌భుత్వంపై నిందలు మోప‌డం ప్రారంభించిందంటూ మండిప‌డ్డారు సిసోడియా.

త‌మ స‌ర్కార్ ప్ర‌తిపాద‌న అని కేంద్ర హొం శాఖ చేసిన వాద‌న‌ను తోసిపుచ్చారు డిప్యూటీ సీఎం. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా ఆదేశాలు జారీ చేశార‌ని, ఆ త‌ర్వాత కేంద్రం కూడా రంగంలోకి దిగింద‌న్నారు.

ఢిల్లీ పోలీసులు, కొంద‌రు అధికారులు రోహింగ్యాల‌కు న‌గ‌రంలో శాశ్వ‌త నివాసం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి పేర్లను ఉద‌హ‌రించేందుకు ఇష్ట ప‌డ‌లేదు.

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , న‌గ‌ర హోం శాఖ మంత్రికి తెలియ‌కుండానే వారు ఎల్జీ స‌క్సేనా ఆమోదం కోసం ప్ర‌తిపాద‌న‌లు పంపుతున్నారంటూ సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

రోహింగ్యాల‌ను అక్ర‌మంగా స్థిర ప‌ర్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను తాము అడ్డుకుంటామ‌న్నారు సిసోడియా(Manish Sisodia). కేంద్రం కావాల‌ని క‌య్యానికి కాలు దువ్వుతోందంటూ మండిప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గా చోటు చేసుకున్న వివాదంపై కేంద్ర హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అటువంటి చ‌ర్య‌కు పాల్ప‌డ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ మేర‌కు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది.

కొత్త ప్ర‌దేశానికి రోహింగ్యాల‌ను త‌ర‌లించాలంటూ ఢిల్లీ స‌ర్కారే త‌మ వ‌ద్ద‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపించింద‌ని తెలిపింది. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌ని స్పష్టం చేసింది. ఆప్ స‌ర్కార్ రాజ‌కీయం చేస్తోందంటూ ఆరోపించింది.

Also Read : ర‌ష్యా ప్ర‌ధాన‌మంత్రితో అజిత్ దోవ‌ల్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!