Manish Sisodia : మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు
మనీ లాండరింగ్ కేసులో జూన్ 1 దాకా
Manish Sisodia : మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బిగ్ షాక్ తగిలింది ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు(Manish Sisodia). ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో పీకల లోతు దాకా కూరుకు పోయిన సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. కేసు విచారణకు సంబంధించి మంగళవారం కోర్టుకు హాజరయ్యారు సిసోడియా.
ఆయనను భారీ పోలీసు బందోబస్తు మధ్య తీసుకు వచ్చారు. ఇదే సమయంలో మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఓ పోలీస్ అధికారి సిసోడియా భుజంపై చేయి వేసి లాక్కుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించి ఆప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా విచారణ చేపట్టిన ధర్మాసనం జూన్ 1 వరకు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో మరోసారి జైలుకు తరలించారు పోలీసులు. ఇదిలా ఉండగా తనకు చదువుకునేందుకు పుస్తకాలు కావాలని, కుర్చీ, టేబుల్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా మనీష్ సిసోడియా న్యాయమూర్తికి విన్నవించారు.
దీంతో ఆయన విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న జడ్జి అవసరమైన పుస్తకాలు, కుర్చీ, టేబుల్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. సిసోడియా కోర్టు గది నుడి బయటకు వస్తుండగా ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆరోపించారు.
Also Read : Sarah Todd PM Modi
