Manmohan Singh : ఓటు వేసిన మన్మోహన్ సింగ్
వీల్ చైర్ పై వచ్చిన మాజీ పీఎం
Manmohan Singh : భారత దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తన విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం దేశ అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి కోసం పోలింగ్ జరుగుతోంది.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) తన అత్యంత విలువైన ఓటు ను వీల్ చైర్ పై వచ్చి వేయడం విస్తు పోయేలా చేసింది.
జూలై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం వీల్ చైర్ పై వచ్చి మన్మోహన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మన్మోహన్ సింగ్ ఓటు వేయడంపై ప్రశంసలు లభిస్తున్నాయి.
ఆరోగ్యం సహకరించక పోయినా సరే ఓటు వేయడం గొప్పనైన అంశమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్ ఖర్ పోటీలో ఉన్నారు.
ప్రతిపక్షాల సంకీర్ణ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా మన్మోహన్ సింగ్ ఓటు వేసిన సమయంలో జగదీప్ ధన్ ఖర్ సహాయం చేయడం కనిపించింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ఓటు వేయడంపై స్పందించింది. ఆయన తన పదవీ కాలంలో భారత దేశ ప్రజాస్వామ్య సంస్థలను బలంగా నిర్మించాడని తెలిపింది. సింగ్ కు ప్రజలందరి మద్దతు ఎల్లప్పటికీ ఉంటుందన్నారు.
Also Read : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన మోదీ