Mansukh Mandaviya Rahul : రాహుల్ కు మన్సుఖ్ ఝలక్
కోవిడ్ రూల్స్ పాటించాలని సూచన
Mansukh Mandaviya Rahul : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం చైనాలో కరోనా ఇంకా తగ్గలేదని, భారత్ లో తగ్గుముఖం పట్టినా రాబోయే రోజుల్లో మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
ఇక రాహుల్ గాంధీ జోడో యాత్రలో భారీ ఎత్తున జనం పాల్గొంటున్నారని, వారంతా విధిగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు అయి ఉండాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
ఈ ఆదేశాలతో కూడిన ప్రకటనను రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు పంపింది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ఈ ఏడాది సెప్టెంబర్ 6న తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. 150 రోజుల పాటు కొనసాగుతుంది.
మొత్తం 3,578 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో పూర్తయింది. ప్రస్తుతం హర్యానాలోకి చేరుకుంది. ఇదిలా ఉండగా ఢిల్లీలో చేపట్టే యాత్రలో ప్రముఖ నటుడు లోక నాయకుడు కూడా పాల్గొననున్నారు.
ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు జనాదరణ లభిస్తున్నందు వల్లనే బీజేపీ తట్టుకోలేక పోతోందని ఆరోపించారు. ఇది మాండవీయకు(Mansukh Mandaviya) నచ్చడం లేనట్టు అనిపిస్తోందంటూ పేర్కొన్నారు.
Also Read : ‘మతం సమానత్వం’ మధ్య పోరాటం