Margaret Alva : ఉప రాష్ట్రపతి బరిలో మార్గరెట్ అల్వా
ఎవరీ మార్గెట్ ఆల్వా ఏమిటా కథ
Margaret Alva : ఊహించని రీతిలో ముందస్తుగానే విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఉప రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వాను ఎంపిక చేశాయి.
ఆదివారం తమ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈనెల 18న భారత దేశ రాష్ట్రపతి పదవికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి.
బీజేపీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశారు.
ఈనెల 21న ఈ పోటీకి సంబంధించి ఫలితాలు వెలువడనున్నాయి. ఇక కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ కంటే ముందే విపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడంతో బిగ్ షాక్ తగిలింది మోదీ త్రయానికి.
ఇదిలా ఉండగా ఈ నెలలో రాష్ట్రపతి ఎన్నిక జరిగిన వెంటనే కొన్ని రోజులకు ఉప రాష్ట్రపతి ఎన్నిక మొదలు కానుంది. ముందస్తు వ్యూహంలో భాగంగా మార్గరెట్ అల్వాను(Margaret Alva) ఎంపిక చేయడం చర్చకు దారి తీసింది.
మార్గరెట్ అల్వా 1974లో కాంగ్రెస్ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి చెందిన జగదీప్ ధన్ ఖర్ పై ప్రతిపక్షాలు అల్వాను రంగంలోకి దింపాయి.
ఆదివారం జరిగిన ప్రతిపక్షాల సమావేశం అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు. మార్గరెట్ అల్వా ఏప్రిల్ 14, 1942లో కర్ణాటక లోని మంగళూరులో పుట్టారు.
విద్యార్థుల ఉద్యమాలలో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆమె లా అభ్యసించారు. ఐదు సార్లు ఎంపీగా ఉన్నారు. కేంద్ర కేబినట్ లో పార్లమెంటరీ వ్యవహారాలు, యువజన సర్వీసులు చూశారు.
Also Read : లంక సంక్షోభం భారత్ జోక్యం అవసరం