Massive Avalanche : హిమపాతం ఆరుగురు దుర్మరణం
చిక్కుకున్న మరో 150 మంది
Massive Avalanche : సిక్కింలో చోటు చేసుకున్న భారీ హిమపాతం కారణంగా ఆరుగురు దుర్మరణం చెందారు. 150 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సిక్కిం లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాథులా సరిహద్దు వద్ద భాదరీ హిమపాతం సంభవించింది(Massive Avalanche).
మరణించిన వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. కనీసం 12 మంది గాయపడ్డారని, ఇంకా 50 మంది మంచు కింద చిక్కుకున్నట్లు పోలీసులు పీటీఐకి తెలిపారు. ఇప్పటి వరకు చిక్కుకు పోయిన 30 మంది పర్యాటకులను రక్షించారు. చికిత్స కోసం గాంగ్ టక్ లోని ఎస్టీఎన్ఎం హాస్పిటల్ , సెంట్రల్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఇండో చైనా సరిహద్దు వెంట నాథులా పర్వత మార్గానికి దారి తీసే రహదారిపై 15వ మైలు సమీపంలో హిమ పాతం సంభవించింది. స్థానిక ట్రావెల్ ఏజెంట్లు, కమర్షియల్ వెహికిల్ డ్రైవర్లు , టూరిజం శాఖ అధికారులు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పోలీసులు , ఇతర బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. విషయం తెలిసిన వెంటనే పీఎం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : 11 స్థలాలకు చైనా కొత్త పేర్లు