Hailstrom Delhi : గతంలో వర్షం ఎప్పుడు వస్తుందనేది పూర్తిగా క్లారిటీ ఉండేది. కానీ వాతావరణ పరిస్థితులలో మార్పులు చోటు చేసుకోవడం. పర్యావరణానికి హాని కలగడంతో వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని సందిగ్దత స్థితి నెలకొంది.
తాజాగా ఎండా కాలం సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. అంతే కాదు పలు చోట్ల వడగళ్ల వాన ముంచెత్తింది. పలు చోట్ల నీళ్లు రోడ్లపైనే నిలిచి పోయాయి.
వాతావరణ శాఖ ప్రకారం కనిష్ట ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్షియస్ గా నమోదైంది. పాక్షికంగా మేఘావృతమైన వానలు, ఎడ తెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వానలు పడే అవకాశం ఇవాళ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉన్నట్టుండి మెరుపు వాన (Hailstrom Delhi )కురియడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎవరూ ఊహించని రీతిలో వర్షం రావడంతో జనం పరేషాన్ కు లోనయ్యారు.
విచిత్రంగా వడగళ్లు కురియడం అనేది ఓ వింత లాగా మారింది ఢిల్లీ వాసులకు. చలి కాలం నుంచి ఎండా కాలం ప్రారంభం కావడంతో ఉన్నట్టుండి ఎండ నుంచి సేద దీరేందుకు వర్షం రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
మొత్తంగా ఢిల్లీని వాతావరణ కాలుష్యం కాటు వేసే స్థాయికి చేరింది. ట్రైబ్యునల్ సైతం తప్పు పట్టంది.పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేసింది.
ఇక దేశంలోనే అత్యధిక కాలుష్యపు నగరాల్లో ఢిల్లీ కూడా ఉండడం గమనార్హం. ఎన్ని చర్యలు తీసుకున్నా ఇంకా పెరుగుతోంది తప్పా తగ్గడం లేదు. స్వీయ నియంత్రణతోనే సాధ్యం అవుతుంది.
Also Read : కేంద్ర సర్కార్ పై శివసేన కన్నెర్ర