Elon Musk : ట్విట్ట‌ర్ లో భారీగా ఉద్యోగాల కోత

తొల‌గించే ప్లాన్ లో ఎలాన్ మ‌స్క్

Elon Musk : ప్ర‌పంచ కుబేరుల్లో టాప్ లో ఉన్న టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్(Elon Musk) తాజాగా ట్విట్ట‌ర్ ను తీసుకున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది భారీ డీల్. గ‌త కొంత కాలంగా ట్విట్టర్ కొనుగోలు విష‌యంలో డోలాయ‌మానంలో ఉన్న ఎలాన్ మ‌స్క్ ఉన్న‌ట్టుండి కొనుగోలుకు ఓకే చెప్పారు.

ఆ మేర‌కు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలోకి నెట్టి వేస్తూ తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంత‌రం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ట్విట్ట‌ర్ లో టాప్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ ప‌రాగ్ అగ‌ర్వాల్, చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ సెగ‌ల్ , లీగ‌ల్ హెడ్ విజ‌యా గద్దెతో పాటు ప‌లువురిని తొల‌గించారు.

పై ముగ్గురికి $100 మిలియ‌న్లు ఇవ్వ‌నున్న‌ట్లు టాక్. ముంద‌స్తుగా తొల‌గించ‌డం అనేది ట్విట్ట‌ర్ ఒప్పందంలో తాము తీసి వేసినా లేదా తొల‌గించినా మొత్తం వేతనాల‌తో పాటు అన్ని సౌక‌ర్యాల‌కు సంబంధించి డబ్బుల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే స‌మ‌యంలో దాదాపు 70 శాతానికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు రెడీ అయిన‌ట్లు స‌మాచారం.

కంపెనీని టేకోవ‌ర్ చేశాక ఎలాన్ మ‌స్క్(Elon Musk) కంప‌నీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున తొల‌గించే ప‌నిలో బిజీ బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం. పైకి జాబ్స్ ను తొల‌గించ‌నంటూ ఎలాన్ మ‌స్క్ చెబుతున్నా వాస్త‌వానికి మొత్తానికి మొత్తంగా బ‌య‌ట‌కు పంపించే ప‌నిలో ప‌డిన‌ట్లు టాక్.

కొనుగోలు కంటే ముందు సిఇఓ త‌న‌తో స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ లేద‌న్న క‌సితో మొత్తం టీంకే ఎస‌రు పెట్టారు ఎలాన్ మ‌స్క‌. కాగా ఆయ‌న కొనుగోలు వెనుక అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : ట్విట్ట‌ర్ కు పోటీగా జాక్ డోర్సీ ‘బ్లూస్కీ’

Leave A Reply

Your Email Id will not be published!