Mastan Survey : తెలంగాణలో సారు ‘కారు’దే జోరు
రాష్ట్రంలో మస్తాన్ సర్వే కలకలం
Mastan Survey : తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కాయి. ఓ వైపు భారీ వర్షాలు జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా ఉన్నట్టుండి పిడుగు లాంటి బాంబు పేల్చారు తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి వెంటనే అసెంబ్లీ రద్దు చేస్తానని ప్రకటించారు.
దీంతో ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీలు సై అంటే సై అన్నాయి. కానీ
మేధావులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం సీఎం కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏ పద్దతిన ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ నిలదీశారు. ఆపై నిప్పులు చెరిగారు కేసీఆర్ పై.
ఇది రాజరిక వ్యవస్థ కాదని, ప్రకటించేందుకు సీఎం ఎవరు..సై అనేందుకు విపక్షాలు ఎవరంటూ ప్రశ్నించారు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి. ఇదిలా ఉండగా కేసీఆర్ ఎనిమిదేళ్ల కాలంలో ఏయే హామీలు ఇచ్చారు.
ఎన్ని అప్పులు చేశారో అడగాల్సిన విపక్షాలు ఇలా ఎన్నికలకు రెడీ అని చెప్పడం ముమ్మాటికీ తప్పేనన్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో
పేరొందిన మస్తాన్ సర్వే (Mastan Survey) ఊహించని ఫలితాలు ప్రకటించింది ఇవాళ.
మరోసారి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. ఇదే విషయాన్ని వెల్లడించడం కలకలం రేపింది. ఇప్పటికిప్పుడు
ఎన్నికలు చేపడితే టీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది.
గులాబీ పార్టీకి 38.88 శాతం, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్ కు 23.71 శాతం ఇతరులకు 6.93 శాతం ఓట్లు వస్తాయని రిపోర్టులో పేర్కొంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 5 శాతం ఓట్లను కోల్పోతుందని తెలిపింది.
బీజేపీకి 23.5 శాతం అధిక ఓట్లను పొందుతుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ తనకు ఉన్న 4.72 శాతం ఓట్లను కోల్పోతుందని సంచలన సర్వే వెల్లడించింది.
Also Read : మూడు రోజులు విద్యా సంస్థలు బంద్