Mayawati : అమిత్ షా కామెంట్స్ కు మాయావ‌తి ఫిదా

ఆయ‌న త‌న పెద్దరికాన్ని నిల‌బెట్టుకున్నారు

Mayawati  : ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతున్న త‌రుణంలో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ మాయావ‌తి Mayawati ) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ, స‌మాజ్ వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంతో పాటు ప‌లు పార్టీలు బ‌రిలో ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు విడ‌త‌ల పోలింగ్ ముగిసింది. ఇంకా మూడు విడ‌త‌ల పోలింగ్ జ‌రగాల్సి ఉంది. ఇవాళ ల‌క్నో లోని మున్సిప‌ల్ స్కూల్ లో బీఎస్పీ చీఫ్ మాయావ‌తి ఓటు హ‌క్కు వినియోగించుకుంది.

అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ముస్లింలు స‌మాజ్ వాది పార్టీని న‌మ్మ‌డం లేద‌ని, మొత్తం త‌మ వైపు ఉన్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

అంతే కాదు గుండా రాజ్ , మాఫియా రాజ్ కు ప్ర‌జ‌లు ఓట్లు వేయర‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపాయి. అయితే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ మాయావ‌తి(Mayawati )చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు.

బీఎస్పీని ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని, ఆ పార్టీ ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీకి, యోగికి రెండో పార్టీగా మారి పోయింద‌ని ఆరోపించారు. ప‌నిలో ప‌నిగా ఎంఐఎం కూడా ఓట్లు చీల్చే ప‌నిలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా బీఎస్పీ గురించి సానుకూల దృక్ఫ‌థంతో మాట్లాడారు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ చంద్ర షా. ఆయ‌న బీఎస్పీని, మాయావ‌తిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. త‌న ప‌ట్ల ఔదార్యాన్ని ప్ర‌ద‌ర్శించిన షాకు ధ‌న్య‌వాదాలు తెలిపింది.

Also Read : మ‌రాఠా కేబినెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

Leave A Reply

Your Email Id will not be published!