Medaram Jatara 2026: మేడారం మహాజాతర తేదీలు ఖరారు
మేడారం మహాజాతర తేదీలు ఖరారు
Medaram Jatara : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమస్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Jatara) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగనుంది. తొలిరోజు జనవరి 28న సారలమ్మ దేవత, రెండో రోజు 29న సమస్క దేవతలను గద్దెల మీదకు తీసుకొస్తారు. ఆపై 30న వన దేవతలకు ప్రజలు బెల్లం సమర్పించి తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సమస్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్లు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరుతున్నారు.
Medaram Jatara 2026 Updates
తెలంగాణ (Telangana) కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం జాతర జరుగుతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ.
దేశరాజధానిలో లాల్‌దర్వాజ బోనాలు
లాల్ దర్వాజ బోనాలు దేశరాజధాని దిల్లీలో రెండో రోజు ఘనంగా జరిగాయి. మంగళవారం ఇండియాగేట్ నుంచి తెలంగాణభవన్ వరకు మహంకాళి అమ్మవారి ఘటాల ఊరేగింపు ధూంధాంగా జరిగింది. తొలుత సింహవాహిని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రెసిడెంట్ కమిషనర్ శశాంక్‌గోయల్ ఇండియాగేట్ వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి 150 మంది సాంస్కృతిక కళాకారుల సంప్రదాయ డప్పు మోతలు, పోతురాజుల ఆటలు, ఒగ్గుడోలు నాట్యాలు, పూర్ణకుంభాల మధ్య అమ్మవారి ఘటాల ఊరేగింపు తెలంగాణభవన్ వరకు సాగింది.
ఈ కార్యక్రమం దేశరాజధానిలో వివిధ రాష్ట్రాల ప్రజలతోపాటు, విదేశీపర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంది. పలువురు విదేశీయులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తూ భారతీయ సాంస్కృతిక రూపాలను, బోనాల పండగ వైభవాన్ని ఫొటోలు, వీడియోల్లో బంధించారు. ఊరేగింపు అనంతరం తెలంగాణ భవన్‌లో ఘటాల స్థాపన జరిగింది.
Also Read : Minister Ashwini Vaishnaw: రెండు సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు – కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
