CEC Gyanesh Kumar: నివసించే చోట మాత్రమే ఓటరుగా నమోదు కావాలి – సీఈసీ

నివసించే చోట మాత్రమే ఓటరుగా నమోదు కావాలి - సీఈసీ

CEC Gyanesh Kumar : ఓటర్లు తాము సాధారణంగా నివాసం ఉంటున్న ప్రదేశంలో ఓటరుగా నమోదు కావాలే తప్ప తమకు సొంతిల్లు ఉన్న ప్రదేశంలో కాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ (CEC Gyanesh Kumar) స్పష్టం చేసారు. ఈ సంవత్సరం శాసనసభ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఆయన మంగళవారం బూత్‌స్థాయి అధికారుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలిసో తెలీకో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరు కార్డు కలిగివున్నవారిని గుర్తించే ఉద్దేశంతో ఓటరు జాబితా సమీక్ష చేపట్టామని చెప్పారు. ‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక వ్యక్తి తాను నివాసం ఉన్న శాసనసభ నియోజకవర్గంలోనే ఓటు వేయడానికి అర్హుడు.

CEC Gyanesh Kumar Comments

‘‘వాస్తవానికి ప్రజాప్రా­తినిధ్య చట్టం ప్రకారమైతే ఏ శాసనసభ నియో­జకవర్గంలో అయితే ఓటరు నివసిస్తా­డో అక్కడే అతనికి ఓటు హక్కు వినియోగించు­కునే హక్కు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఢిల్లీలో నివసిస్తున్నారు. సొంతిల్లు బిహా­ర్‌­లోని పట్నాలో ఉంది. అయినాసరే మీరు ఢిల్లీలోనే ఓటర్‌గా పేరును నమోదుచేసుకోవాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నా­రు. ‘‘కొందరు గతంలో ఉన్న ప్రాంతంలో సంపాదించిన ఓటరు కార్డును అలాగే అట్టిపెట్టుకుని, కొత్త ప్రాంతంలో మరో ఓటర్‌ కార్డు­ను సాధిస్తున్నారు. పోలింగ్‌ వేళ పాత ప్రాంతంలో ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. రెండుచోట్ల ఓటరు కార్డు కలిగి ఉండటం నేరం’’అని సమావేశంలో పాల్గొ­న్న కొందరు అధికారులు గుర్తుచేశారు.

Also Read : Medaram Jatara 2026: మేడారం మహాజాతర తేదీలు ఖరారు

Leave A Reply

Your Email Id will not be published!