Medico Preethi Comment : కడుపు శోకం వెల కట్టలేం
మెడికో ధారావత్ ప్రీతి మరణం
Medico Preethi Comment : ఎవరైనా బతకాలని కోరుకుంటారు. ఏరికోరి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించరు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులే అలా ప్రేరేపిస్తాయి. సామాజికంగా కనిపించని వివక్ష అనాది నుంచి నేటి దాకా కొనసాగుతూ వస్తోంది. దీనికి అంతం లేదు. ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్ని శిక్షలు వేసినా మనుషుల్లో మార్పులు రావడం లేదు.
కానీ తొమ్మిది నెలలు మోసి , అల్లారు ముద్దుగా పెంచుకుని , అప్పులు చేసి చదివించి ప్రయోజకులు కావాలని చేస్తే..కళ్ల ముందే రాలి పోతే ఆ కన్న తల్లిదండ్రుల శోకం వర్ణనాతీతం. ఇది ఏ పగ వాళ్లకు రాకూడదు.
గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఆత్మహత్యలకు పాల్పడే వారు. కొన్ని పరువు కోసం ఇంకొన్ని ప్రేమలో వైఫల్యం, ఆర్థిక ఇబ్బందులు, చదువుల్లో ర్యాంకులు రాక పోవడం ఇలా అనేక సమస్యలు కారణంగా ఉండేవి. కానీ రాను రాను టెక్నాలజీ పెరిగింది. అయినా మనుషుల మధ్య ఎందుకనో అంతరాలు కూడా బాగా పెరిగాయి.
ఎప్పుడైతే రాజకీయాలు విద్వేషాలను ప్రాతిపదికగా , ఓటు బ్యాంకుగా చేస్తూ ముందుకు సాగుతున్నాయో ఆనాటి నుంచి సమాజంలో అన్ని అవలక్షణాలు టాప్ లో కొనసాగుతూ వస్తున్నాయి. ప్రతి రోజూ ఎవరో ఒకరు ఏదో బలీయమైన కారణంతో తనువులు చాలిస్తున్నారు.
విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. దీనికి కారణం ఎవరు..సమాజమా లేక అందులో ఉన్న మనమా అని ఆలోచించు కోవాలి. ఇవాళ అందరి ముందున్నది ఒకే ఒక్క ప్రశ్న.
వరంగల్ లోని గిర్ని తాండాకు చెందిన ధారావత్ ప్రీతి చని పోయింది(Medico Preethi). అంత్యక్రియలు పూర్తయ్యాయి. తాండా అంతా తరలి వచ్చింది. చివరి చూపు కోసం..ఆమె చేసిన నేరం ఏమిటి.
దాని వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి. ఎవరు దీనిని ప్రోత్సహించారు. ఒక పీజీ స్థాయికి ఎదిగిన మెడికోను ఎందుకు టార్గెట్ చేశారు. కులం పేరుతో దూషించారని, తనను సీనియర్లు టార్గెట్ చేశారంటూ వాపోయింది. వారి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని కన్నీటి పర్యంతమైంది. ఇంత జరిగినా , సీసీ కెమెరాలు, మందీ మార్బలం, భారీ పోలీసు వ్యవస్థ ఎందుకు కాపాడ లేక పోయాయి. కావాలని చేశారా.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం వాట్సాప్ సందేశాలలో సైఫ్ పేరు ఉందని , వేధింపులకు గురి చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
మరి ఇలా వేధించాలని, ర్యాగింగ్ కు పాల్పడాలని ఏమైనా రూల్ రాసి ఉందా. ఉంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా. ఎందుకని ధారావత్ ప్రీతినే లక్ష్యంగా చేసుకున్నారు. సైఫ్ ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా..ఉంటే వాళ్లు ఎవరో సమాజానికి ప్రకటించ కూడదా.
కోర్టు ఏం చేస్తోంది. మానవ హక్కుల సంఘం మౌనంగా ఎందుకుంది..చిల్లర మల్లర రాజకీయాలు చేసే వాళ్లు ప్రీతి విషయంలో నేరస్తులను బయట పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు.
అవున ఇవాళ ప్రీతిని పోగొట్టుకున్న (Medico Preethi Comment) ఆ కుటుంబానికి దిక్కు ఎవరు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల కడుపు శోకానికి వెల కట్టగలమా.
ఇవాళ ప్రీతి చని పోయింది..రేపు మన పిల్లలు కూడా టార్గెట్ కాకుండా ఉంటారా..పేరెంట్స్ ఇకనైనా ఆలోచించండి..మారాల్సింది సమాజం కాదు..మనమే మారాలి. మన పిల్లల్ని మనమే కాపాడు కోవాలి. లేకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉండాల్సి వస్తుంది.
Also Read : వ్యవస్థలో లోపం ఆత్మహత్యల పర్వం