Meenakshi Lekhi : భారతీయులను క్షేమంగా తీసుకొస్తాం
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ప్రకటన
Meenakshi Lekhi : న్యూఢిల్లీ – కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్ పై హమాస్ టెర్రరిస్టులు ఊహించని రీతిలో అటాక్ చేశారు. దీంతో భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి.
Meenakshi Lekhi Comment
ప్రస్తుతం భారత దేశ ప్రభుత్వం భారతీయుల తరలింపుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఎప్పటికప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి.
ఇజ్రాయెల్ లో ప్రస్తుతం చిక్కుకున్న భారతీయులతో టచ్ లో ఉన్నామని స్పష్టం చేశారు. మన వారందరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు లేఖి(Meenakshi Lekhi). ఇప్పటి దాకా బంకర్లు, హోటళ్లలో భారత దేశానికి చెందిన విద్యార్థులు తల దాచుకున్నారని చెప్పారు కేంద్ర మంత్రి. ప్రధాని నేరుగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో ఉక్రెయిన్ , యెమెన్ లో చిక్కుకున్న వారిని రక్షించడం జరిగిందన్నారు. భారతీయులందరినీ ఇబ్బందులు లేకుండా క్షేమంగా భారత్ కు తీసుకు వస్తామని, ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు మీనాక్షి లేఖి.
Also Read : Minister KTR : నెట్టింట్లో ‘రేటెంత రెడ్డి’ వైరల్