Meenakshi Natarajan: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ స్ట్రాంగ్ వార్నింగ్
కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ స్ట్రాంగ్ వార్నింగ్
Meenakshi Natarajan : తెలంగాణా కాంగ్రెస్ లో లుకలుకలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోనికి దిగారు. ఢిల్లీ నుండి తెలంగాణా చేరుకున్న ఆమె నేటి నుండి రాష్ట్రంలో పార్టీ పనితీరుపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదంటూ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) హెచ్చరించారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని ఆమె నాయకులకు సూచించారు.
Meenakshi Natarajan Slams
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని.. నియోజకవర్గ ఇంఛార్జ్ లు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇంఛార్జ్ వల్లే సమస్యలు వస్తే… పదవి నుంచి తొలగిస్తామంటూ ఆమె హెచ్చరించారు. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారన్న కాట శ్రీనివాస్ గౌడ్… సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా… ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలంటూ ఇంఛార్జ్ ని కాట శ్రీనివాస్ కోరారు.
అదే సమయంలో అధికారులు తమ మాట వినడం లేదన్న మరి కొందరు నేతలు… ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తాన్నారంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందంటూ మీనాక్షి నటరాజన్‌కు పలువురు నేతలు చెప్పారు. ఈ విషయాలపై ఒక నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఆమె నాయకులకు హామీ ఇచ్చారు.
Also Read : Yogi Adityanath: త్రివేణీ సంగమ జలాలు సురక్షిత స్థాయిలోనే ఉన్నాయి – సీఎం యోగి