Mega DSC: మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి లోకేశ్
మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి లోకేశ్
Mega DSC : ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలను మెగా డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఎంపిక జాబితాను అధికారికంగా వెబ్ సైట్ లో విడుదల చేసినట్లుగా విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ మెగా డీఎస్సీ – 2025లో ఎంపికైన అభ్యర్ధులకు మంత్రి లోకేశ్ (Minister Nara Lokesh) అభినందనలు తెలిపారు. అలాగే apdsc.apcfss.in వెబ్సైట్లో ఈ అభ్యర్థుల ఎంపికల జాబితా లభ్యమవుతుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
Mega DSC Final List
మెగా డీఎస్సీ (Mega DSC) తుది ఎంపిక జాబితా విడుదల అనంతరం ఆయన ‘ఎక్స్’లో … ‘‘మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరింది. ఈ మైలురాయి నా బాధ్యతను మరింత పెంచింది. ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు. హామీ ఇచ్చినట్లు ఏటా డీఎస్సీ (Mega DSC) నిర్వహిస్తాం. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ తుది ఫలితాలు విడుదల చేసిన అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, విద్యా శాఖ కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ… ఈ రోజు శుభదినమన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రిగా నారా లోకేష్ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఈ తుది సెలక్షన్ లిస్టు ఇప్పుడే రిలీజ్ చేశామని పేర్కొన్నారు. ఎంతో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసే అవకాశం తమకు ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.
దాదాపు వందకుపైగా కేసులు ఉన్నా.. ఎక్కడా ఆటంకం రాకుండా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియనంతా పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఈ పరీక్షకు సంబంధించి 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి.. అందులో సోమవారం 15,941 మందికి అపాయింట్ ఇస్తున్నామన్నారు. అయితే ఈ సారి ఎస్సీ వర్గీకరణను సైతం పరిగణలోనికి తీసుకున్నామని తెలిపారు. కాల్ సెంటర్లలో వచ్చిన కాల్స్ అన్నింటింకి పరిష్కారం చేశామని తెలిపారు.
తుది జాబితాలో 49.9 శాతం మంది మహిళలు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్ 19వ తేదీన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి లోకష్ తదితరుల సమక్షంలో అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. వీరికి జిల్లాల్లో ట్రైనింగ్స్ ఇచ్చి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా అందజేస్తాని తెలిపారు. ఈ లిస్టును అన్ని చోట్ల పబ్లిష్ చేస్తున్నాం… హరిజంటల్ రిజర్వేషన్ ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు డిఈవో ఆఫీసుల్లో చెప్ప వచ్చని అభ్యర్థులకు వారు సూచించారు. దీనిలో వెయిటింగ్ లిస్టు… సెకండ్ లిస్టు ఉండదన్నారు. 406 ఫిల్ కానివి వచ్చే డీఎస్సీకి వెళుతుందని చెప్పారు. వచ్చే టెట్ నవంబర్‌లో ఉంటుందని… ఈ నేపథ్యంలో అభ్యర్ధులు తయారు కావాలని కోరుతున్నామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటనను ఏప్రిల్ 20న విడుదల చేసింది. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రాథమిక కీ … ఆగస్టు 1న తుది కీ విడుదల చేశారు. టెట్‌కు 20% వెయిటేజీ ఇచ్చారు. ఏడు విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు.
భర్తీ కాని 406 పోస్టులు
డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ ఖాళీలకు గాను 15,941 పోస్టులను అధికారులు భర్తీ చేశారు. ఆయా విభాగాల్లో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 406 పోస్టులు భర్తీ కాలేదు.
Also Read : CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – సీఎం రేవంత్‌రెడ్డి
