Mega DSC: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల ! వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు !

మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల ! వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు !

Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఐచ్ఛికాలు స్వీకరించారు. ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.

Mega DSC – వెబ్ సైట్ లో మెగా డీఎస్సీ హాల్‌టికెట్లు

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే మెగా డీఎస్సీకి(Mega DSC) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. జూన్‌ 6 నుంచి 30 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇటీవల మొత్తం 17 పేపర్లకు సంబంధించిన నమూనా పరీక్షను అందుబాటులో తీసుకొచ్చిన విద్యాశాఖ అధికారులు… తాజాగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ కోసం వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు పొందొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్‌ 20 నుంచి మే 15వరకు దరఖాస్తులు ఆహ్వానించగా… అన్ని పోస్టుకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read : Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు

Leave A Reply

Your Email Id will not be published!