మెగాస్టార్ బాస్ ఈజ్ బ్యాక్ : అల్లు అర్జున్

ప్ర‌శంస‌లు కురిపించిన అల్లు అర్జున్

హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బుధ‌వారం స్పందించారు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీపై. ఈ సినిమా సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఊహించ‌ని రీతిలో కాసుల వ‌ర్షం కురిపించింది. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది. సినీ ప్రేక్ష‌కుల‌నే కాదు సినీ వ‌ర్గాల‌ను సైతం విస్తు పోయేలా చేసింది. దీంతో అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు అల్లు అర్జున్. బ‌న్నీ చిరంజీవిని ఉద్దేశిస్తూ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కితాబు ఇచ్చారు. అంతే కాకుండా త‌న‌కు పోటీ ఎవ‌రూ రారంటూ పేర్కొన్నారు. ఎల్ల‌ప్పటికీ చిరంజీవే అస‌లైన మెగాస్టార్ అని, ఆయ‌నే నెంబ‌ర్ వ‌న్ హీరో అంటూ స్ప‌ష్టం చేశారు అల్లు అర్జున్.

అంతే కాదు అల్లు అర్జున్ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను అభినందించారు. మెగాస్టార్ ను అద్బుతంగా డ్యాన్స్ చేసేలా స్వ‌రాలు కూర్చావంట పేర్కొన్నారు. ఈల‌లు వేయించేలా చేశారు. ముఖ్యంగా హుక్ స్టెప్ , మెగా విక్టరీ పాటలకు ప్రశంసించారు. ఇది నిజమైన సంక్రాంతి విందు అని అభివర్ణించారు. మన శంకర వర ప్రసాద్ గారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు. బాస్ తిరిగి వచ్చారు. అద్భుతం. మన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తెరపై వెలిగిపోవడాన్ని చూసి సంతోషంగా ఉందన్నారు అల్లు అర్జున్. వెంకటేష్ అదరగొట్టారు. నయనతార హుందాగా న‌టించింది. ఇక కేథరీన్ ట్రెసా హాస్యభరితమైన యాక్టింగ్ అదుర్స్ అన్నారు. ప్ర‌త్యేకంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడిని ఆకాశానికి ఎత్తేశాడు.

Leave A Reply

Your Email Id will not be published!