Menaka Gambhir ED : అభిషేక్ బెనర్జీ కోడలికి అర్ధరాత్రి సమన్లు
పూర్తిగా రాజ్యాంగ బద్ద వ్యవస్థకు విరుద్దం
Menaka Gambhir ED : టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కోడలు మేనకా గంభీర్ కు(Menaka Gambhir ED) ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).
ఆమెను విదేశాలకు వెళ్లకుండా ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈడీ సమాచారం అందించింది.
ఆ మేరకు ఆమె వెళ్లేందుకు నిరాకరించారు. విచిత్రం ఏమిటంటే కేంద్ర ఏజెన్సీ జారీ చేసిన సమన్లలో అర్దరాత్రి 12.30 గంటలకు రావాలంటూ పేర్కొన్నారు.
దీనిని మేనకా గంభీర్ తప్పు పట్టారు. ఏ రాజ్యాంగంలో ఒక మహిళను అర్ధరాత్రి విచారించాలని ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి మేనకా గంభీర్ ను(Menaka Gambhir ED) ప్రశ్నించాలనుకున్న కేంద్ర ఏజెన్సీ తాజాగా సమన్లు జారీ చేసింది.
ఈ సమన్లకు సంబంధించి బొగ్గు అక్రమ రవాణా కేసులో విచారణ నిమిత్తం తృణమూల్ కాంగ్రెస్(TMC) ఎంపీ అభిషేక్ బెనర్జీ కోడలు మేనకా గంభీర్ సోమవారం మధ్యాహ్నం కోల్ కతా లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు.
విచిత్రం ఏమిటంటే మధ్యాహ్నానికి బదులు అర్ధరాత్రి రావాలంటూ సమన్లు అందుకోవడంతో మేనకా గంభీర్ విస్తు పోయారు. రాత్రి పూట మహిళను ప్రశ్నించ కూడదనే నిబంధనలను కేంద్ర ఏజెన్సీ స్పష్టంగా ఉల్లంఘించారంటూ ఆరోపించారు ఎంపీ కోడలు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈడీ ఆఫీసు తాళం వేసి ఉండగా మేనకా గంభీర్ నిలిచి ఉన్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : శిబూ సోరేన్ కు ఢిల్లీ హైకోర్టు ఊరట