Meta CEO Warning : జుకర్ బర్గ్ స్ట్రాంగ్ వార్నింగ్
పనితీరు మార్చుకోక పోతే వేటే
Meta CEO Warning : సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతున్న మెటా – ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఐటీ, లాజిస్టిక్ , ఫార్మా, మీడియా, డెలివరీ కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తోంది. గూగుల్, అమెజాన్ , సిస్కో, ఫిలిప్స్ , తదితర కంపనీలన్నీ ఇప్పటి వరకు 80 వేలకు పైగా సాగనంపాయి.
తాజాగా మెటా, ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెటాలో పని చేస్తున్న కీలకమైన పోస్టులలో ఉన్న మేనేజర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. పనిలో వ్యక్తిగత ప్రతిభ తప్పక ఉండాల్సిందేనని, లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు(Meta CEO Warning). ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకోనని స్పష్టం చేశారు సిఇఓ.
ఇంత కాలం కంపెనీ భరిస్తూ వచ్చిందని ఇక నుంచి తాము భరించే పరిస్థితుల్లో ఉండేది లేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే మరికొందరికి మంగళం పాడే ఛాన్స్ ఉందని సమాచారం. కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మార్క్ జుకెర్ బర్గ్.
ఈ ఏడాది పని చేస్తున్న ప్రతి ఒక్కరు పనితీరులో ప్రతిభ కనబర్చాలి లేకుంటే భరించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు జుకర్ బర్గ్. తాజాగా టెక్నాలజీలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కోడింగ్ , డిజైనింగ్ , రీసెర్చ్ వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. లేకపోతే కంపెనీ నుంచి వెళ్లిపోవచ్చని కుండ బద్దలు కొట్టారు.
ఇదిలా ఉండగా మెటా ఫేస్ బుక్ లో మొత్తం 87 వేల మందికి పైగా పని చేస్తుండగా ఇప్పటి వరకు 11 వేల మందిని సాగనంపింది.
Also Read : బింగ్ షాక్ ఇవ్వడం ఖాయం – సిఇఓ