Migrant Labour Killed : కాశ్మీర్ లో వలస కార్మికుడి కాల్చివేత
మొన్న టీచర్ నిన్న బ్యాంకర్ నేడు కార్మికుడు
Migrant Labour Killed : కాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. పౌరుల్ని టార్గెట్ గా పెట్టుకుని కాల్చడమే పనిగా పెట్టుకున్నారు. మొన్న కుల్గామ్ లోని ఉన్నత పాఠశాలలో పాఠాలు చెబుతూ బయటకు వచ్చిన హిందూ మహిళా టీచర్ ను కాల్చి చంపారు.
నిన్న ఇదే ప్రాంతంలో రాజస్తాన్ నుంచి ఉద్యోగ నిమత్తం వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఓ ఉగ్రవాది కాల్చి చంపాడు. తాజాగా బ్యాంకర్ ని పొట్టన పెట్టుకున్న కొన్ని గంటల తర్వాత బతుకు దెరువు కోసం వచ్చిన వలస కార్మికుడిని కాల్చి(Migrant Labour Killed) చంపారు.
దీంతో కాశ్మీర్ లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ అయ్యారు.
తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. కానీ ఉగ్రవాదులు మాత్రం పేట్రేగి పోతున్నారు. ఎవరి మాట వినడం లేదు. అంతే కాదు ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది.
భారత జవాన్లు గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతం వరుసగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ కాల్పుల ఘటనలో వలస కార్మికుడు(Migrant Labour Killed) చని పోగా మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సెంట్రల్ కాశ్మీర్ జిల్లాలోని చదూరా ప్రాంతంలోని మాగ్రేపోరా వద్ద ఇటుక బట్టీలో ఇద్దరు స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
ఈ దాడిలో మృతి చెందిన కార్మికుడిని బీహార్ కు చెందిన దిల్కుష్ కుమార్ గా గుర్తించారు. రాత్రి 9.10 నిమిషాల ప్రాంతంలో ఈ దాడికి ఒడిగట్టారు దుండగులు.
Also Read : కాశ్మీర్ లో బ్యాంక్ మేనేజర్ కాల్చివేత