Migrant Labourer Shot Dead : కాశ్మీర్ లో వ‌ల‌స కూలీ కాల్చివేత‌

కొనసాగుతున్న ఉగ్ర‌వాదుల కాల్పుల మోత‌

Migrant Labourer Shot Dead : ఉగ్ర‌వాదులు త‌మ పంథాను మార్చుకుంటున్నారు. భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు ఎంత‌గా మోహ‌రించినా త‌మ దాడుల్ని ఆప‌డం లేదు. నిన్న భార‌త ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు జ‌వాన్లు వీర మ‌ర‌ణం పొందారు. శుక్ర‌వారం మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. జ‌మ్మూ కాశ్మీర్ లోని బందిపూర్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడిని ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు.

సోద్నారా సుంబ‌ల్ వ‌ద్ద అర్ధ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాజౌరిలో న‌లుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన త‌ర్వాత కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకోవ‌డం మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.

బీహార్ లోని మాధేపురా నివాసి మ‌హ్మ‌ద్ అమ్రోజ్(Migrant Labourer Shot Dead) ను కాల్చి చంపారు. కొన ఊపిరితో ఉన్న అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ఆప్పటికే మార్గ మ‌ధ్యంలోనే చ‌ని పోయిన‌ట్లు ఆస్ప‌త్రి వైద్యులు ధ్రువీక‌రించారు.

ఈ విష‌యాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదులు వ‌ల‌స కార్మికులు మొహ‌మ్మ‌ద్ అమ్రేజ్ , మొహ‌మ్మ‌ద్ జ‌లీల్ కూలీ ప‌నుల కోసం జ‌మ్మూ కాశ్మీర్ కోసం వ‌చ్చారు.

అమ్రోజ్ కాల్పుల్లో చ‌ని పోగా జ‌లీల్ ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డాడు. ఇదిలా ఉండ‌గా ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.

ఆత్మాహుతి దాడిలో సుబేదార్ రాజేంద్ర ప్ర‌సాద్ , రైఫిల్ మెన్ మ‌నోజ్ కుమార్ , రైఫిల్ మెన్ ల‌క్ష్మ‌ణ‌న్ , నిశాంత్ మాలిక్ ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు.

జ‌మ్మూ కాశ్మీర్ జోన్ లో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.

Also Read : ద‌మ్ముంటే ఈడీ నా ఇంటికి రావ‌చ్చు

Leave A Reply

Your Email Id will not be published!