Minister Anam : తిరుమల ఆలయ అభివృద్ధిపై మంత్రి కీలక వ్యాఖ్యలు
శనివారం టీటీడీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమీక్షా..
Minister Anam : తిరుమల భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam) వెల్లడించారు. శనివారం టీటీడీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ సమావేశం తిరుమల శుద్ధీకరణ కార్యక్రమాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు జరుగుతోందని పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆమోదం అనంతరం అమలు చేస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
Minister Anam – ఆలయ అభివృద్ధికి నిరంతర కృషి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 160 ఆలయాల్లో భక్తులకు దర్శనం సులభతరం చేసినట్టు చెప్పారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అదనంగా, 200కు పైగా ఆలయాల పునర్నిర్మాణానికి కామన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
300 ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి ఆనం తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో భక్తులకి ఉన్నత స్థాయి సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
భక్తుల భద్రత, సౌకర్యాలు మరియు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పరిపుష్టి చేసేందుకు తీసుకుంటున్న ఈ చర్యలు తిరుమలతో పాటు రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో కూడా ప్రత్యక్ష ఫలితాలుగా మారే అవకాశం ఉందని మంత్రివర్యులు అభిప్రాయపడ్డారు.
Also Read : Donald Trump : భారతీయ విద్యార్థులకు మరోసారి షాకిచ్చిన ట్రంప్
