Minister Anam : రెవిన్యూ రికార్డుల్లో అవకతవకలపై వైసీపీపై భగ్గుమన్న మంత్రి ఆనం

గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు...

Minister Anam : వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆత్మకూరు ఎమ్మెల్యే, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం మర్రిపాడు మం పొంగూరు గ్రామంలో రెవెన్యూ సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటోను ముద్రించి రైతులను నిలువు దోపిడీ చేసే ప్రయత్నం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని తెలిపారు.

Minister Anam Slams

గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పొంగూరు, నాయుడుపల్లి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అంతుకుముందు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రెవెన్యూ సదస్సును మంత్రి ఆనం ప్రారంభించారు.

Also Read : INDIA Block : రోజురోజుకు ‘ఇండియా కూటమి’ నుంచి మమతా బెనర్జీకి పెరుగుతున్న మద్దతు

Leave A Reply

Your Email Id will not be published!