Minister Ashwini Vaishnaw: తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆశక్తికరమైన వ్యాఖ్యలు
తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆశక్తికరమైన వ్యాఖ్యలు
Ashwini Vaishnaw : త్రిభాషా విధానాన్ని తమిళనాడులోని స్టాలిన్ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ… కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్… తమిళ భాషపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw)… ‘తమిళం ఒక తియ్యటి భాష. తమిళ భాష, సంస్కృతి, సంప్రదాయాలను అందరూ గౌరవించాలి. తమిళం మన దేశ ఆస్తి మాత్రమే కాదు… ప్రపంచ ఆస్తి కూడా. అందుకే మనం గర్వపడాలి అంటూ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు నేను కాన్పూర్ ఐఐటీలో చదువుతున్న సమయంలో పరిచయమైన ఆచార్య శఠగోపన్ నాకు తమిళం నేర్పించారు. తమిళం మధురమైన భాష’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
Ashwini Vaishnaw Interesting Comments
అదే సమయంలో భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి. ఆ స్ఫూర్తితోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. దేశంలో మాట్లాడే ప్రతి భాషకూ సముచిత స్థానం కల్పించడంతో పాటు తగిన గౌరవం కల్పించేలా ప్రధాని వ్యవహరిస్తున్నారు. విభిన్న నాగరికతల మధ్య మన దేశ సౌభ్రాతృత్వానికి, స్నేహానికి, సంబంధాలకు ఎలాంటి అడ్డంకులు రాకూడదు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను రూపొందించడంతో పాటు మన బలాన్ని ప్రపంచం గుర్తించేలా అందరూ పాటుపడాలి. ఐఐటీ చెన్నై విద్యార్థులు ఇటీవల హైపర్‌లూప్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ప్రాజెక్ట్ భారతీయ రైల్వేకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దీనితో మంత్రి అశ్వినీ వైష్ణవ్ చర్చనీయాంశంగా మారాయి. స్టాలిన్ సర్కారు త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న వేళ… తమిళ భాషను పొగడ్తలతో ముంచెత్తుతూ… త్రిభాషా విధానం యొక్క ఆవశ్యకతను మంత్రి అశ్వినీ వైష్ణవ్ చాలా చక్కగా వివరించారంటూ తమిళనాడు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read : Tej Pratap Yadav: కానిస్టేబుల్ ను బెదిరించి డ్యాన్స్ చేయించిన తేజ్‌ప్రతాప్ యాదవ్