Minister Ashwini Vaishnaw : తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో 750 కోట్ల రూపాయలతో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయావుతాయని అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు.
Union Minister Ashwini Vaishnaw Good News
ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ… కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని.. ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని అన్నారు. తెలంగాణలో ఇదో పెద్ద ప్రాజెక్టు అన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దేశంలోనే ఇది… అతి పెద్ద రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని.. వందేభారత్ బోగీలు కూడా ఇక్కడే తయారవుతాయని మంత్రి వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటమని చెప్పారు. ‘ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చాం. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. వాళ్ల సిఫార్సు మేరకు ఉద్యోగాలు కల్పిస్తాం. ‘‘ఇక్కడ రైల్వే వ్యాగన్లు, కోచ్‌లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను ప్రధాని మోదీ మంజూరు చేశారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. వరంగల్‌కు ఇప్పటికే విమానాశ్రయం రావాల్సి ఉంది. ఎయిర్‌పోర్టుకు భూములు ఇవ్వాలని గతంలో కేసీఆర్‌ను ఎన్నోసార్లు అడిగాం. భూసేకరణ గురించి ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం’’ అని పేర్కొన్నారు. మోదీ చేస్తున్న అభివృద్ధి.. కళ్లున్న వాళ్లు చూడాలి, చెవులన్న వాళ్లు వినాలి. లేదంటే ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకోండి. మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఎంత త్వరగా అప్పగిస్తే అంత త్వరగా ఎయిర్ పోర్ట్ లో విమానాలు ఎగురుతాయి’ అని కిషన్ రెడ్డి తెలంగాణ సర్కారుపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.
Also Read : CM Revanth Reddy: కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి ఆశక్తికరమైన వ్యాఖ్యలు
