Minister Atishi: ఢిల్లీ కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం – మంత్రి అతిశీ

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం - మంత్రి అతిశీ

Minister Atishi: ఢిల్లీలోని రాజేంద్రనగర్‌ ఉన్న రావూస్ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ లోకి వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన విషయంతెలిసిందే. రావూస్‌ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు విద్యార్థులు తాన్యా సోని, శ్రేయా యాదవ్, నవిన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు. దీనితో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని సహచర విద్యార్థులు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి అతిశీ(Minister Atishi) అన్నారు.

బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ…. ‘‘ఢిల్లీ(Delhi)లో కోచింగ్‌ సెంటర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్ట తీసుకురానుంది. ఈ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్‌ సెంటర్లలోని విద్యార్థులతో ఓ కమిటిని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం తీసుకువచ్చే చట్టంలో మౌలిక వసతులు, టీచర్ల విద్యార్హత, ఫీజు నిబంధనలు, తప్పుదోవ పట్టించే కోచింగ్‌ సెంటర్ల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. చట్ట రూపకల్పన ప్రజల నుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరిస్తాం.

బిల్డింగ్‌ బేస్‌మెంట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ(Delhi) మున్సిపల్ కార్పొరేషన్‌( డీఎంసీ) కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే రాజేంద్రనగర్‌, ముఖర్జీ నగర్‌, లక్ష్మీ నగర్‌, ప్రీత్‌ విహార్‌లో ఉన్న బేస్‌మెంట్లను కలిగి ఉన్న 30 కోచింగ్‌ సెటర్లను సీజ్‌ చేశాం. మరో 200 కోచింగ్ సెంటర్లకు డీఎంసీ అధికారులు నోటీసులు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టును ఆరు రోజుల్లో సమర్పిస్తాం. ఈ ఘటనలో మున్సిపల్‌ అధికారులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’అని అతిశీ(Minister Atishi) తెలిపారు.

Minister Atishi – ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై దృష్టి ఐఏఎస్‌ యజమాని కీలక వ్యాఖ్యలు

సెంట్రల్‌ దిల్లీలోని రావూస్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ‘దృష్టి ఐఏఎస్‌’ సంస్థ యాజమాన్యం స్పందించింది. ‘‘ముగ్గురు విద్యార్థుల అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిజేస్తున్నాం. ఈ ఘటనతో విద్యార్థుల్లో పెల్లుబికిన ఆగ్రహం సరైందే. వారి ఆవేశం సరైన దిశలో ఉంటేనే మేలు జరుగుతుంది. కోచింగ్ సెంటర్ల కోసం సరికొత్త మార్గదర్శకాల రూపకల్పన విషయంలో మేం సహకరిస్తాం’’ అని తెలిపింది. అలాగే కోచింగ్ సంస్థలకు సంబంధించిన సమస్యలు పైకి కనిపించినంత సులభంగా ఉండవని యజమాని వికాస్ దివ్యకీర్తి అన్నారు. డీడీఏ(ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ), ఎంసీడీ(మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ), అగ్నిమాపక విభాగం నియంత్రణల విషయంలో పలు అసమానతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ మాస్టర్ ప్లాన్‌- 2021లో మినహా మరెక్కడా కోచింగ్ సంస్థలకు సంబంధించి ఎలాంటి నిబంధనలను ప్రస్తావించలేదని గుర్తుచేశారు. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నివేదికలో అయినా తగిన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘ప్రభుత్వమే ఢిల్లీ(Delhi)లో కొన్ని స్థలాలను ఎంపికచేసి, వాటిని కోచింగ్‌ సంస్థల కోసం కేటాయించాలి. తరగతి గదులు, లైబ్రరీలు, హాస్టళ్లకు రూపకల్పన చేస్తే.. అప్పుడు అధిక అద్దె, భద్రతా సమస్యలు ఉండవు’’ అని సూచించారు. ఇక ఈ కేసులో తనను బలిపశువును చేస్తున్నారని మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. ‘‘ఒకరిని బలిపశువును చేయడం వల్ల తాము బయటపడిపోయామని యంత్రాంగం అనుకుంటుంది. ప్రజలేమో నిందితుడు దొరికాడని భావిస్తారు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అలాగే విద్యార్థుల మృతి ఘటనపై ఆలస్యంగా స్పందించడంపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘ఉద్వేగపూరిత అంశాలపై నేను అంతగా మాట్లాడను. ఆ విద్యార్థులకు బాధాకరమైన మరణం సంభవించింది. వారి మృతికి సంబంధించిన ఆలోచనలే నా మదిలోకి వస్తున్నాయి’’ అని తెలిపారు. రావూస్‌ కోచింగ్ సెంటర్ ఘటన తర్వాత ఎంసీడీ నుంచి నోటీసులు అందుకొన్న పలు సంస్థల్లో ‘దృష్టి ఐఏఎస్‌’ కూడా ఉంది. ఆ నేపథ్యంలో వికాస్ స్పందన వచ్చింది.

Also Read : Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో మరోసారి తన సత్తా చాటిన పీవీ సింధు

Leave A Reply

Your Email Id will not be published!