Minister Bandi Sanjay : ఆదివాసీల సంచలన అంశాలను వెల్లడించిన బండి

ఈ నేపథ్యంలో వనవాసీయులు, మైదాన ప్రాంతీయులను ఒకే వేదిక పైకి తీసుకురానున్నట్లు తెలిపారు...

Minister Bandi Sanjay : ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తున్న తరుణంలో కొందరు తప్పుడు ప్రచారాలతో సమాజంలో చీలికలు తెచ్చే యత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Minister Bandi Sanjay) ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు అర్థంపర్థం లేని సంస్కృతిని తీసుకొచ్చి సనాతన ధర్నాన్ని అవహేళన చేస్తున్నాయన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో శనివారం నెక్లె్స్‏రోడ్‌లోని జలవిహార్‌లో ‘లోక్‌ మంథన్‌ భాగ్యనగర్‌- 2024’ కర్టెన్‌రైజర్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆదివాసీలు వైదిక ధర్మంలో భాగమని, గిరిజనుల సంస్కృతి, సనాతన ధర్మం వేర్వేరు కాదన్నారు.

Minister Bandi Sanjay Comment

ఈ ఏడాది నవంబర్‌ 21 నుంచి 24 వరకు నగరంలో ‘లోక్‌ మంథన్‌ భాగ్యనగర్‌’ అంతర్జాతీయ సదస్సు జరగనుండటం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. ప్రజ్ఞాభారతి జాతీయ కన్వీనర్‌ నందకుమార్‌ మాట్లాడుతూ నవంబర్‌లో జరిగే లోక్‌ మంథన్‌ భాగ్యనగర్‌ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వనవాసీయులు, మైదాన ప్రాంతీయులను ఒకే వేదిక పైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆదివాసీ, గిరిజనుల పండుగలు, ఆచారాలను సనాతన ధర్మానికి సంబంధం లేనివిగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వారు చేసే ప్రతీ క్రతువు సనాతన ధర్మానికి అనుగుణంగా సాగేదేనన్నారు. భారత్‌లో గిరిజన జాతి, సనాతన ధర్మం వేర్వేరు కాదంటూ పురాణాల్లోని కొన్ని శ్లోకాలను ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ ఉదహరించారు.

త్రిపురనేని హనుమాన్‌ చౌదరి మాట్లాడుతూ ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాల్లో అణువణువునా వైదిక భావాలుంటాయని పేర్కొన్నారు. నగరవాసులకన్నా గిరిజనులు ఎందులోనూ తక్కువ కాదని, వారి విద్యలు అద్వితీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పద్మశ్రీ దాసరి కొండప్పను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. లోక్‌ మంథన్‌ భాగ్యనగర్‌ సదస్సుకు మొట్టమొదటి ప్రతినిధిగా ఆయన పేరు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మామిడాల గిరిధర్‌, ఏపీ మాజీ సీఎ్‌సలు కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్‌గా మాట్లాడారు.

Also Read : CM Chandrababu-Revanth : మరోసారి భేటీ కానున్న ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు

Leave A Reply

Your Email Id will not be published!