Minister Gummadi Sandhya Rani: కురుపాం విద్యార్థినిలకు మంత్రి సంధ్యారాణి పరామర్శ

కురుపాం విద్యార్థినిలకు మంత్రి సంధ్యారాణి పరామర్శ

Gummadi Sandhya Rani : కురుపాం బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ (KGH) లో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను ఆదివారం సాయంత్రం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhya Rani) పరామర్శించి వారికి అందుతున్న వైద్యసేవలను గురించి కే జి హెచ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఐసోలేషన్, రాజేంద్రప్రసాద్ వార్డు, పిల్లల వార్డులలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి తల్లిదండ్రులతో మంత్రి (Gummadi Sandhya Rani) మాట్లాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో 129 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారన్నారు. అస్వస్థతకు గురైన వారిలో 37 మంది బాలికలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ లో చేర్పించామని అన్నారు.

Minister Gummadi Sandhya Rani Comments

కె జి హెచ్ (KGH) లో 37 మంది బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని… వారికి మెరుగైన వైద్యం అందడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన బాలికలు పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పిల్లల్లో కొందరు హెపటైటిస్ – ఏ తో బాధపడుతున్నారని, దీనివల్ల బాలికలు కొంతమేర ఆనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం బాలికల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి అన్నారు. పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థినిలు విద్య ను అభ్యసిస్తున్నారని చెప్పారు. హాస్టల్ వద్ద మెడికల్ టీంను ఏర్పాటు చేసి పిల్లలను వైద్యపరంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిల్లలందరూ కోలుకొని తిరిగి పంపే వరకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి వివరించారు.

పాఠశాలలో పరిసరాలన్నీ పరిశుభ్రంగానే ఉన్నాయని, పాఠశాలలో నూతనంగా 40 టాయిలెట్స్ నిర్మిస్తున్నామని మంత్రి (Gummadi Sandhya Rani) అన్నారు. గిరిజన ప్రాంతాలలో అన్ని పాఠశాలల్లో ఏ ఎం ఎమ్ లు ఉన్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలలో వాతావరణం మారడం వలన ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారని, పిల్లలు పండగలకు వెళ్లివచ్చిన తరువాత కొంత మేర అస్వస్థతకు గురవుతుంటారని, ఈ సారి విద్యార్థులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. బాలికలు అస్వస్థతకు గురికావడం పై విచారణ చేస్తున్నామని, ఎవరి తప్పిదమైనా ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.

ఇద్దరు విద్యార్థినులు మృతి బాధాకరం – పవన్ కళ్యాణ్

కురుపాంలోని గిరిజన వసతి గృహంలో అస్వస్థతకు గురై ఇద్దరు బాలికలు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో గురుకులంలోని విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడ్డాను. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నాను. అక్కడి పిల్లలు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు రోజుల్లో ఇంటి దగ్గర ఒకరు, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. విశాఖపట్నం కేజీహెచ్ లో 37 మంది విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుంది. అదనపు వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకొని నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలని అధికారులకు స్పష్టం చేయడమైనది. త్వరలో కురుపాం వెళ్ళి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తాను అని తెలిపారు.

విశాఖ బీచ్‌లో విదేశీయుడు మృతి

ఇటలీకి చెందిన 16 మంది విదేశీయులు విశాఖలోని యారాడ బీచ్‌ సందర్శనకు వచ్చారు. స్నానం చేస్తుండగా వారిలో ఒకరు మృతి చెందారు. ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉందని, ఈతకు అనుకూలం కాదని… మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు ముందుగానే హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోకుండా సముద్రంలోకి వెళ్లారు. ఇద్దరు ఇటాలియన్లు అలల ఉద్దృతికి కొట్టుకుపోగా.. పోర్టు మెరైన్ పోలీస్ అప్పారావు, జీవీఎంసీ లైఫ్ గార్డులు వెంటనే అప్రమత్తమై మునిగిపోతున్న వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీపీఆర్‌ చేసినా స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read : CM Chandrababu: రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు – సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!