Minister Jitendra Singh: 2040లో చంద్రుడిపైకి భారత వ్యోమగామి – కేంద్ర మంత్రి జితేందర్ సింగ్
2040లో చంద్రుడిపైకి భారత వ్యోమగామి - కేంద్ర మంత్రి జితేందర్ సింగ్
Jitendra Singh : వికసిత భారత్‌కు దూతగా 2040లో భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ (Jitendra Singh) స్పష్టం చేశారు. ఇది దేశ అంతరిక్ష యాత్రకు అత్యత కీలకమైన అంశం కానుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్పేస్ యాత్ర సక్సెస్ అంశంలో భాగంగా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు తొలి వ్యోమగామి – 2047 నాటికి వికసిత్ భారత్ కోసం అంతరిక్ష కార్యక్రమం యొక్క కీలక పాత్ర’ అనే అంశంపై లోక్‌సభలో చర్చను ప్రారంభిస్తూ మాట్లాడిన ఆయన… 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత అంతరిక్షం రంగానికి సంబంధించి సంస్కరణలు చేపట్టారన్నారు.
Union Minister Jitendra Singh Key Comments
2020లో అంతరిక్క్ష రంగం అభివృద్ధికి ఇప్పటికే ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుందని, వచ్చే దశాబ్దంలో 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, చంద్రుడిపైకి వ్యోమగామిని పంపించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చంద్రయాన్-3 అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2023, జూలై 14వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చంద్రయాన్–3.. 25 కిలోల రోవర్‌ను తీసుకెళ్లగా, చంద్రయాన్–5 మిషన్ 250 కిలోల బరువున్న రోవర్‌ను తీసుకెళ్లనుంది. 2027 నాటికి చంద్రయాన్–4ను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
‘‘సంస్కరణల ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం 800 కోట్ల డాలర్లకు చేరింది. వచ్చే దశాబ్ది నాటికి ఇది 4,500 కోట్ల డాలర్లకు చేరుతుంది. వ్యోమమిత్ర అనే రోబోను వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పంపించనున్నాం. 2027లో తొలిసారిగా మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నాం. 2040లో చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపి… త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. 2035కల్లా మనకూ సొంత అంతరిక్ష కేంద్రం ఉంటుంది’ అని జితేంద్ర సింగ్ వివరించారు.
Also Read : CM Revanth Reddy: తెలంగాణాలో ‘ఓట్ చోరీ’ చేసిన వారి భరతం పడతాం – సీఎం
