Minister Kandula Durgesh: రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వచ్చేలా చూస్తాం – మంత్రి దుర్గేష్‌

రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వచ్చేలా చూస్తాం - మంత్రి దుర్గేష్‌

Kandula Durgesh : రుషికొండ బీచ్‌ లో బ్లూ ఫ్లాగ్‌ బీచ్ ప్రమాణాల స్థాయిని కొనసాగించడమే కాకుండా బీచ్ సుందరీకరణకు జిల్లా యంత్రాంగం అన్ని విభాగాల సమన్వయంతో మరిన్ని చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) పేర్కొన్నారు. గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) పర్యటించారు. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ లో సౌకర్యాలను నిశితంగా పరిశీలించారు. బీచ్ లో దుకాణాలు నడుపుతున్నవాళ్లు, లైఫ్ గార్డులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగించడమే కాకుండా బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Minister Kandula Durgesh Key Comments

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మీడియాతో మాట్లాడారు. పరిశుభ్రత, భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్ మెంట్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను జిల్లా యంత్రాంగం, శాఖల సమన్వయం, రాజకీయ నాయకత్వంతో ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్‌ బీచ్ సర్టిఫికేషన్ అంటే ఎన్నో ప్రమాణాలు చూసి అందించే అంతర్జాతీయ గుర్తింపు అన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయవనరులు పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ ఉన్న బీచ్‌లను విదేశీ పర్యాటకులు సైతం ఎక్కువగా సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వచ్చే విధంగా దృష్టి సారిస్తున్నామన్నారు.

తద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగి, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్గుతాయన్నారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ ఉన్న బీచ్ లను విదేశీ పర్యాటకులు సైతం ఎక్కువగా సందర్శించే వీలుందన్నారు. ఈ క్రమంలో డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ అందించిన బ్లూఫాగ్ సర్టిఫికేషన్ ను నిర్ణీత ప్రమాణాలు పాటించి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్ గా గా పేరున్న రుషికొండ బీచ్ లో పరిశుభ్రత, సౌకర్యాలు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ ఉపయోగపడేలా, అందంగా కనిపించేలా, నిత్యం పరిశుభ్రతను పాటించేలా, సందర్శకులకు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు.

బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పించాలన్నారు. కలకాలం బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉండే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చర్చించామన్నారు. ఈ నెలలో బీచ్‌రోడ్డులో ప్రారంభించనున్న డబుల్‌ డెక్కర్ బస్సుల టూర్‌లో భాగంగా రుషికొండ ప్యాలెస్‌ను కూడా భాగం చేయాలనే ఆలోచనలో ఉన్నామని మంత్రి వెల్లడించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. అనంతరం సాగర్‌నగర్ సమీపంలోని డబుల్ డెక్కర్ బస్సుల ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు.

విశాఖలో టూరిజం యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు

విశాఖపట్నంలో త్వరలోనే టూరిజం యూనివర్సిటీ నెలకొల్పడానికి చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తెలిపారు. పర్యాటక రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం దీని అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సాగర్ నగర్ సమీపంలోని సన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్‌మెంట్‌ కళాశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి సందర్శించారు. విశాఖను అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో సరైన రాజకీయ నాయకత్వం లేకపోవడంవల్ల పుదచ్చేరి ప్రభుత్వం ఆపేసిన కార్డేలియా సముద్ర విహార నౌకను తిరిగి ప్రారంభించామని మంత్రి దుర్గేష్ (Kandula Durgesh) గుర్తుచేశారు. ఈ అంశంపై గతంలో బెంగుళూరులో జరిగిన పర్యాటక సదస్సులో తాను పాండిచ్చేరి మంత్రితో చర్చించి నౌకను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నానని తెలిపారు. అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్ ను విశాఖ పోర్టు అథారిటీ వాళ్లు అద్భుతంగా నిర్మించారని తెలిపారు.. త్వరలోనే క్రూజ్ టూరిజం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ వరకు నాలుగు పర్యాయాలు మాత్రమే నడపాలని నిర్ణయించామని, అనంతరం ఏడాదిలో 365 రోజులు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రూజ్ టూరిజం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించాలని భావిస్తున్నామన్నారు. విశాఖకు వచ్చే పర్యాటకులు కేవలం సముద్రప్రయాణం చేయడం మాత్రమే కాదు స్థానికంగా ఉన్న ప్రాంతాలను సందర్శించేలా టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Also Read : Vallabhaneni Vamsi: వైఎస్ జగన్‌ ‌ను కలిసిన వల్లభనేని వంశీ

Leave A Reply

Your Email Id will not be published!