Minister Kinjarapu Atchannaidu: వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అచ్నెన్నాయుడు ఫైర్
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అచ్నెన్నాయుడు ఫైర్
Kinjarapu Atchannaidu : పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి బంగారు పాళ్యం మార్కెట్ కి వెళ్ళడానికి అనుమతి ఇస్తామని… అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తిలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రెండు రోజుల ఢీల్లీ ప్యటనకు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu)… కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో ప్రత్యేక భేటీ అయ్యారు. వ్యససాయ రంగానికి తొడ్పాటు నివ్వాలని, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు కారణంగా రాష్ట్రంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రికి వివరించారు. పెద్ద మనసుతో రాష్ట్రాన్నిఆదుకోవాలని, సహయ, సహకారాలు అందించాలని విన్న వించారు. మ్యాంగో పల్ప్ పై విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Minister Kinjarapu Atchannaidu Slams YS Jagan
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో (AP) దాదాపుగా 64 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి (YS Jagan) చిన్నా భిన్నం చేశారని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను కూడా వినియోగించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని ధ్వజమెత్తారు.
వెటర్నరీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన మంత్రి అచ్చెన్న
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని గరివిడిలో ఉన్న ‘కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’లో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు గానూ మూడవ, నాల్గవ సంవత్సరాల బీవీఎస్‌సీ, ఏహెచ్ (B.V.Sc, A.H) కోర్సులు పునరుద్ధరణ గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) చూపిన చొరవ వలన కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2022 సంవత్సరం నుండి ఈ కోర్సులకు అనుమతి లేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత కోర్సులకు అనుమతులను పునరుద్ధరిస్తూ లేఖను విడుదల చేశారు. మంగళవారం కేంద్ర పశుసంవర్ధక & పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి లాలన్ సింగ్ ను కలసి మరిన్ని విషయాలు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు
చిత్తూరు మామిడి రైతుల దగ్గర 3.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం, మామిడి ధరపై జగన్ నీచమైన రాజకీయం చేస్తున్నారు. తోతాపురి మామిడి సేకరణను కిలోకు రూ. 12/- ధరను ప్రభుత్వం నిర్ణియించిందని, అందులో రూ. 8/- ప్రాసెసర్లు/వ్యాపారులు భరించాలని, అదనపు మద్దతు ధరగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 4/- చెల్లిస్తుందని, దీనికి సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) కింద రూ. 130 కోట్ల కేంద్ర వాటాను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని ఐదేళ్లు జగన్ చిన్నాభిన్నం చేశాడు. ఓదార్పు అని మళ్లీ బల ప్రదర్శనకు దిగుతున్నారు. చంద్రబాబు ఏడాదిలో 9 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే మళ్లీ దండయాత్ర మొదలెట్టాడు.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. అధికారం ఉందని వీర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ధర్నాల పేరుతో వైసీపీ (YCP) నేతలు దోపిడీకి తెగబడుతున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి బైక్ లు, కార్లు, బస్సుల్లో తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులపై ప్రేమ ఉంటే నిజంగా రైతుల దగ్గరికి వెళ్ళాలి .. ఇంత చేయడం అవసరమా! అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని , కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా వినియోగించలేక పోయిన అసమర్ధ ముఖ్య మంత్రి గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి విచ్చిన్నం చేశారని తీవ్రస్ధాయిలో ఆరోపించారు.
మామిడి రైతులకు అండగా ప్రభుత్వం
2019-2024 మధ్యకాంలో తోతాపురి మామిడి ధర కిలో రూ. 6 రూపాయిలు నుంచి రూ. 4 రూపాయిలకు పడిపోయిందని, వైకాపా ప్రభుత్వం రైతులకు ఒక్కరూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు అదనంగా కేజీకి రూ. 4 సబ్సిడి మద్ధతు ధరను ఇచ్చి రైతులను ఆదుకుంటుందని తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లా రైతుల నుంచి 3.5 మెట్రిక్ టన్నుల మామిడి సేకరించామని, మామిడి ధరపై జగన్ రెడ్డి నీచమైన రాజకీయం చేస్తున్నారని, మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఐదేళ్లలో రైతులకు ఒక్కరూపాయి కూడా చెల్లించలేని అసమర్ధ నాయకుడు జగన్ రెడ్డి అని తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు. మామిడి రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసేందుకే జగన్ రెడ్డి మామిడి రైతులపై దండయాత్రలు చేసేందుకు వెళుతున్నారని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్, రౌడీ షీట్స్ లో ఉన్న వారు జగన్ యాత్రల్లో పాల్గొంటున్నారని విమర్శించారు.
Also Read : Minister Sridhar Babu: కోటి ఇళ్లకు ఇంటర్నెట్ లక్ష్యం – మంత్రి శ్రీధర్‌బాబు
