Minister Kiren Rijiju: జస్టిస్ వర్మ తొలగింపునకు ప్రతిపక్ష నేతల అంగీకారం – కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
జస్టిస్ వర్మ తొలగింపునకు ప్రతిపక్ష నేతల అంగీకారం - కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
Kiren Rijiju : దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. దీనితో ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం… అతనిపై విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తప్పించేలా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ అంగీకారం తెలిపాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) గురువారం వెల్లడించారు. అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, లోక్సభలోనా అనే విషయంపై నిర్ణయం తీసుకున్నాక ఆయా పార్టీల సభ్యుల నుంచి సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు. అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో అయితే కనీసం 50 మంది సభ్యుల సంతకాలు అవసరమవుతాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి.. రాజ్యసభలో లేదా లోక్సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాక.. విచారణ జరపడానికి ఛైర్మన్ లేదా స్పీకర్ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు.
Union Minister Kiren Rijiju – 19న అఖిలపక్ష సమావేశం ! 21 నుంచి పార్లమెంటు సమావేశాలు !
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండు రోజులు ముందుగా 19వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజులపాటు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారని కిరణ్ రిజిజు ‘ఎక్స్’లో వెల్లడించారు.
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 13, 14వ తేదీల్లో సమావేశాలు ఉండవని చెప్పారు. పార్లమెంటు సమావేశాలను ఆగస్ట్ 12వ తేదీతోనే ముగించాలని ముందుగా నిర్ణయించారు. అయితే కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన వాటిని అమలు చేయడానికే సమావేశాల వ్యవధిని మరో తొమ్మిది రోజులు పొడిగించినట్లు సమాచారం. సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సంక్షేమానికి సంబంధించిన బిల్లులతో సహా పలు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Also Read : PM Narendra Modi: బిహార్ ముద్దుబిడ్డ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని – మోదీ
