Minister Kishan Reddy : మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మరింత మమేకమవుతున్న ప్రధాని
గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించడంపై మహిళలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు...
Kishan Reddy : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్ ద్వారా ప్రజలకు చాలా అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమం ఎవరూ చేపట్టలేదని అన్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలతో మమేకమవుతున్నారని తెలిపారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సనత్‌నగర్‌లోని లింగయ్య నగర్‌లో స్థానికులతో కలసి కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఈ కార్యక్రమం వీక్షించారు.
Minister Kishan Reddy Key Comments
గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించడంపై మహిళలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. వారు వ్యవసాయానికి సంబంధించిన వివిధ పనుల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఘటనలో 26మంది అమాయకులైన మన పర్యాటకులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మన సైనికులు పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి నాశనం చేశారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా తీరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉగ్ర దాడులను సమర్థంగా ఎదుర్కోవడంలో మన సైనికులు ముందున్నారని అన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ ఇవాళ(ఆదివారం) జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణలోని డ్రోన్‌దీదీలను ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లాలో మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ తీసుకున్నారని చెప్పారు. పండ్ల తోటలపై పురుగు మందులు వాడటానికి డ్రోన్లను వినియోగించారని తెలిపారు. ఈ క్రమంలో డ్రోన్ దీదీలను స్కైవారియర్స్‌గా ప్రధాని మోదీ అభివర్ణించారు.
Also Read : KTR Meet : కవిత కొత్త పార్టీ పెడుతుందంటూ వస్తున్న వార్తలు.. కెసిఆర్ ను కలిసిన కేటీఆర్
