Minister Kishan Reddy: కేటీఆర్‌ పై కిషన్‌ రెడ్డి సీరియస్

కేటీఆర్‌ పై కిషన్‌ రెడ్డి సీరియస్

 

 

మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ మాజీ మంత్రి ఎక్కడ ఉన్నా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు వినాలన్నారు. బేగంపేట, కరీంనగర్‌, వరంగల్‌ లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన అమృత్‌ భారత్‌ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మహిళలే పని చేయబోతున్నారని తెలిపారు. దేశంలో 1,300 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ప్రమాదాలు జరగకుండా కవచ్‌ టెక్నాలజీని తీసుకొచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

 

దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. దేశంలో 1,300 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. 2026లో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరగబోతున్నాయని వెల్లడించారు.ఎంఎంటీఎస్‌ రెండో ఫేజ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

 

బేగంపేట రైల్వేస్టేషన్లలో మహిళలే పనిచేయబోతున్నారన్నారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. రూ.80వేల కోట్ల పనులకు సంబంధించిన ప్లాన్లు జరగుతున్నాయన్నారు. దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారని.. ఇక యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్ ప్రారంభిస్తామన్నారు.

 

మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ మాజీ మంత్రి ఎక్కడ ఉన్నా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు వినాలన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేస్తే మాజీ సీఎం కేసీఆర్ కనీసం రాలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విప్లవాత్మకమైన అభివృద్ధి పనులు చేసి చూపిస్తామన్నారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించుకున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే అప్రోచ్ రోడ్‌కు భూసేకరణ పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంత వేగంగా సహకరిస్తే అంతకంటే వేగంగా కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!