Minister Konda Surekha: మంత్రుల అవినీతిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
మంత్రుల అవినీతిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Minister Konda Surekha : మంత్రులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు చేసారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో… ఆమె వెనక్కి తగ్గారు. తన మాటలను కొంతమంది వక్రీకరించారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలేంటి వెనక్కి తగ్గడానికి గల కారణమేంటి
వరంగల్ లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) మాట్లాడుతూ…
‘ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి. విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పాతది కూలగొట్టి, కొత్త భవనం కట్టాలని కలెక్టర్ నా దృష్టికి తెచ్చారు. ఇందుకు రూ. 4.5 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో దారీతెన్ను తెలియలేదు. మరి నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి… నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్లతో నేను అన్నా… మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా.
అప్పుడు వారు మా చేతుల్లో లేదు… పై వాళ్లతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకు చెందిన సదానంద రెడ్డి చెప్పారు. చివరకు సీఎస్ఆర్ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది’’ అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో గ్రౌండ్, రెండంతస్థులతో 15 తరగతి గదులు, ఆడిటోరియం తరహాలో పెద్ద హాల్, 60 అధునాతన టాయిలెట్లు, నూతన ఫర్నిచర్ విద్యార్థినులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. దీనితో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Minister Konda Surekha – నా వ్యాఖ్యలను వక్రీకరించారు – మంత్రి కొండా సురేఖ
అయితే తన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో కొండా సురేఖ(Minister Konda Surekha) వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సహేతుకం కాదని చెప్పారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని తెలిపారు.
మాజీఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్
బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా నాణ్యంగా కట్టలేదు అని ఆరోపించారు. సాగర్ రింగ్‌రోడ్ చౌరస్తాలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ప్లైఓవర్ లూప్‌ను గురువారం జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సుజాతానాయక్ తో కలిసి మధుయాష్కీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారం, పది రోజుల్లో ప్లైఓవర్ పనులు పూర్తవుతాయని, వాహనదారులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలు కర్మన్‌ఘాట్, చంపాపేట, సంతోష్‌నగర్ వైపు వెళ్లేందుకు సులభతరం కానుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైపాల్‌రెడ్డి, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, డేరంగుల కృష్ణ, తోకటి కిరణ్, ప్రవీణ్‌రెడ్డి, కందికంటి శ్రీధర్‌గౌడ్, సుధీర్ పాల్గొన్నారు.
Also Read : Dynoser: తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు