Minister Kondapalli Srinivas: రాజకీయ లబ్ధికోసమే పెన్షన్లపై వైసీపీ అసత్య ప్రచారం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రాజకీయ లబ్ధికోసమే పెన్షన్లపై వైసీపీ అసత్య ప్రచారం - మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Kondapalli Srinivas : నోటీసులు ఇచ్చిన దివ్యాంగ పింఛన్‌దారులందరికీ ఈనెల పింఛన్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. సోమవారం ఉదయం యధావిధిగా సచివాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యే వరకు గ్రామ, మండల స్థాయి అధికారులకు సెలవులు ఉండవన్నారు. దివ్యాంగుల పింఛను తొలగింపుపై వైసీపీ చేస్తున్న ప్రచారమంతా అవాస్తవమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ బ్యాచ్ ఫేక్ ప్రచారం చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందుతుందని మంత్రి స్పష్టం చేశారు.
Kondapalli Srinivas – 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ ల పంపిణీకి రూ. 2,746.52 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబర్ ఒకటవ తేదీన 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు రూ. 2,746.52 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పెన్షన్ పంపిణీ చేయడానికి రూ. 3.15 కోట్లు కూడా విడుదలచేశామని మంత్రి చెప్పారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల కోసం రూ. 32,143 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇందులో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీకి రూ. 16,366.80 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ కోసం రూ. 10,000 కోట్లకు మించి కేటాయించడం లేదని తెలియజేశారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా, లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందించడం తోపాటు వారి జియో-కోఆర్డినేట్స్‌ను కూడా నమోదు చేస్తున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వంటి నిరుపేద, నిస్సహాయ వర్గాల కష్టాలను తొలగించడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా అమలు చేస్తోందని అన్నారు. దేశంలో సామాజిక భద్రతా పెన్షన్ కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.
Also Read : Sudarshan Reddy: జగన్ కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి ఫోన్
