Minister Kondapalli Srinivas: ఘనంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు

Minister Kondapalli Srinivas : టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోనికి అడుగుపెట్టారు. చంద్రబాబు వజ్రోత్సవ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు భారీ కేకులను కట్ చేసి ర్యాలీలు నిర్వహించారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు(CM Chandrababu) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్… విజయనగరం పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజపతినగరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా రక్తదానం చేసారు.

Minister Kondapalli Srinivas – చంద్రబాబుకు ప్రముఖుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తన అఫీషియల్ సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. భవిష్యత్‌ రంగాలపై దృష్టి సారించి ఆయన పని చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ తెలిపారు.

‘‘సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ప్రయత్నాలు ఏపీని పురోగతిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నాయి. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను’’-కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

‘‘చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని చంద్రబాబుకు భగవంతుడివ్వాలి.’’ – తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నట్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపుతూ వైసీపీ అధినేత జగన్‌ తన అఫీషియల్ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

‘‘నిండు నూరేళ్లు సుఖశాంతులతో చంద్రబాబు వర్థిల్లాలి. సుభిక్ష పాలన అందించేందుకు చంద్రబాబుకు దేవుడు మరింత శక్తినివ్వాలి.’’ – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌

‘‘ఏపీ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఆయన మంచి పనులు చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని మేం కొనసాగించాం. మంచి పనులను భారాస ఎప్పుడూ అడ్డుకోలేదు’’- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

Also Read : Minister P Narayana: గుజరాత్‌ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం

Leave A Reply

Your Email Id will not be published!