Minister Kondapalli Srinivas: అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు రెండు కళ్ళు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు రెండు కళ్ళు - మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Minister Kondapalli Srinivas : అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండు కళ్ళులాంటివని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అందుకే ఎన్నికల హామీల్లోని సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ… రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి 58 వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు వేయడం జరిగిందని, అందుకు సంబంధించిన విజన్ ప్రణాళికను ప్రధాని మోడీ ఆవిష్కరించడం శుభపరిణామం అని మంత్రి తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర రాజధానిని పునఃప్రారంభం చేయడం, రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు వేయడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేసారు. శనివారం విజయనగరంలోని మంత్రి తన కాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు మంత్రి కొండపల్లి(Minister Kondapalli Srinivas) ధన్యవాదాలు తెలిపారు.
Minister Kondapalli Srinivas Comment
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) మాట్లాడుతూ… రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా రాజధానిని అభివృద్ధి చేసుకోలేకపోయామని… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజధానికి కావలసిన వనరులన్నింటినీ సమకూర్చగలిగారని తెలిపారు. అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలకడం శుభపరిణామం అన్నారు. అమరావతిలో ఐ.టి, టెక్ హబ్ లను అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రం లో అన్ని జోన్స్ లో అభివృద్ధి కోసం విజనరీ డాక్యుమెంట్ ను రూపొందించారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ, అర్బన్ ప్రాంతాలను ఎంపిక చేసి ఒక ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని, దీని ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రంలో 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు ప్రారంభించినట్లు చెప్పారు. మరో 39 పార్కుల ఏర్పాటుకు నిధులు సిద్ధం చేసినట్లు తెలిపారు.
అహంకారం, దురుద్దేశంతో జగన్ అమరావతిని విధ్వంసం చేశారు – ప్రత్తిపాటి
అమరావతి పునర్నిర్మాణం తెలుగుజాతికి ఆత్మవిశ్వాసాన్ని అందించిందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధానికి అండగా ఉంటామన్న ప్రధాని వ్యాఖ్యలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. అమరావతిలో ఇకపై రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల హోరు వినిపిస్తుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ప్రయోజనాలు ప్రజలకు దక్కుతాయని వివరించారు. రైతుల ఆనందబాష్పాల సాక్షిగా సభ విజయవంతమైందని పేర్కొన్నారు. జగన్ తన అహంకారం, దురుద్దేశంతో అమరావతిని విధ్వంసం చేశారని విమర్శించారు.
Also Read : Hyderabad Police: హైదరాబాద్ డీజీపీ పేరిట ఉన్న వాహనాలపై 17,391 చలానాలు పెండింగ్
