Minister KTR : యుఎస్ లో కేటీఆర్ బిజీ
పలువురితో ముచ్చట
Minister KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి బిజీగా ఉన్నారు. ఆయన అమెరికాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా వివిధ కంపెనీలు, చైర్మన్లు, సిఇవోలను కలుస్తున్నారు. ఆయన వెంట జయేశ్ రంజన్ ఉన్నారు.
Minister KTR in America
ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా మంత్రి కేటీఆర్(KTR) పంచుకున్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. ఎక్కడి అమెరికా ఎక్కడ తెలంగాణ. ఒకప్పుడు దూరంగా ఉండేదని..కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ దూరం మరింత దగ్గరై పోయిందన్నారను కేటీఆర్.
టూర్ లో భాగంగా మంత్రి ప్రముఖ అమెరికన్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ప్రతినిధులతో ముచ్చటించారు. వారికి రాష్ట్ర సర్కార్ తరపున జ్ఞాపికను అందజేశారు. ఈ సంస్థ ఆర్థిక నిర్వహణతో పాటు బ్యాంకింగ్ సెక్టార్ లో కీలకంగా వ్యవహరిస్తోంది.
హైదరాబాద్ లో సదరు సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకుంది. గోల్డ్ మన్ సాచ్స్ ఏర్పాటు వల్ల దాదాపు 2,000 మందికి పైగా వివిధ విభాగాలలో జాబ్స్ వస్తాయని కేటీఆర్ వెల్లడించారు.
తమ ప్రభుత్వం కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు సౌకర్యంగా ఉండేలా వన్ టైం పాలసీని తీసుకు వచ్చామని తెలిపారు కేటీఆర్.
Also Read : CM KCR : ప్రభుత్వం సంసారం ఒక్కటే