Minister KTR : యాదాద్రికి ధీటుగా భద్రాద్రి అభివృద్ది
ప్రకటించిన ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : భద్రాద్రి – తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి కృషి చేస్తోందని అన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రిలో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Minister KTR Commitment
తమ కుటుంబానికి దేవుడి మీద అపారమైన నమ్మకం ఉందన్నారు. అందుకే శ్రీరాముడు పేరు వచ్చేలా తనకు తారక రామారావు అని పేరు పెట్టారని గుర్తు చేశారు. ఏపీలో తిరుమల ఎలా అభివృద్ది జరిగిందో కేసీఆర్ సారథ్యంలో యాదగిరి గుట్టను అద్భుతంగా డెవలప్ చేశారని చెప్పారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీర్చి దిద్దడం జరిగిందన్నారు కేటీఆర్.
ఇప్పటికే పేరు పొందిన భద్రాద్రిని అదే స్థాయిలో అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉందని అన్నారు కేటీఆర్. తమను ఢీకొనే రాష్ట్రం ఇప్పుడు దరి దాపుల్లోనే లేవన్నారు. ఇటు ఐటీలో అటు లాజిస్టిక్ లో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు.
ఐటీ అంటే ఒకప్పుడు బెంగళూరు అని చెప్పే వారని కానీ సీన్ మారిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారని ఈ క్రెడిట్ అంతా కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
Also Read : CM KCR : కాంగ్రెస్ మోసం తెలంగాణ ఆగమాగం