Minister KTR : టెక్నాలజీ..సైన్సెస్ కు హైదరాబాద్ కేరాఫ్
స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్
Minister KTR : ఐటీ, పురపాలిక, పరిశ్రల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన బయో ఏషియా 2024 కు సంబంధించి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడారు కేటీఆర్. టెక్నాలజీ బయాలజీ , డేటా సైన్సెస్ లైఫ్ సైన్సెస్ కలిసే ఏకైక ప్రదేశం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క హైదరాబాద్ మాత్రమేనని స్పష్టం చేశారు.
Minister KTR Said about Bio Asia-2024
వచ్చే ఏడాది 2024లో ఫిబ్రవరి 26 నుండి 28 వరకు హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బయో ఏషియా -2024 జరగనుందన్నారు. దీని కోసం ఎంత గానో ఆసక్తితో ఎదురు చూస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్.
బయో ఏషియా కు సంబంధించి ఈ 21వ ఎడిషన్ లైఫ్ సైన్సెస్ , హెల్త్ కేర్ రంగాలలో అవకాశాలను పునర్నిర్వచించేందుకు డేటా, ఏఐ కలుస్తుందన్నారు. డేటా , ఏఐ రీ డిఫైనింగ్ పాసిబిలిటీస్ అనే అంశంపై ఈ సదస్సు జరగనుందని తెలిపారు కేటీఆర్(KTR). ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్ , బయో టెక్నాలజీ భవిష్యత్తును రూపొందించడంలో డేటా ఆధారిత సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు ముఖ్యమైన పాత్ర పోషించనుందన్నారు.
ఇదిలా ఉండగా వచ్చే సంవత్సరంలో నిర్వహించే బయో ఏషియా సదస్సుకు ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. దీని వల్ల ఎన్నో అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం.
Also Read : Arvind Kejriwal : పనులు చేస్తాం ఓట్లు అడగం