Minister KTR : హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతిపక్షాలు ప్రధానంగా ఖాళీగా ఉన్న జాబ్స్ ఎందుకు భర్తీ చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నాయి. వీటినే ప్రధాన అస్త్రంగా ముందుకు తీసుకు వచ్చాయి.
Minister KTR Comments Viral
ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్(Minister KTR). బుధవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా జాబ్స్ ను భర్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఈ సందర్బంగా పంచుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్ 2,32,308 పోస్టులను డైరెక్టు పద్దతి ద్వారా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. 1,60,83 కొలువులను భర్తీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు కేటీఆర్.
తాను ఛాలెంజ్ చేస్తున్నానని ఏ రాష్ట్రంలో నైనా లక్షా 60 వేలకు పైగా జాబ్స్ భర్తీ చేశాయా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఇది పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు కేటీఆర్. తాము ఏయే శాఖల్లో ఖాళీగా ఉన్నాయో పూర్తి వివరాలు పొందు పర్చడం జరిగిందన్నారు. వెరిఫై చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
Also Read : Revanth Reddy : పాలమూరు పౌరుషం చాటండి